ప్రియుడి ఘాతుకం.. కాబోయే భార్య కోసం ఐదుగురిని 10 అడుగులో గోతిలో..

by Sumithra |   ( Updated:2021-06-30 07:16:14.0  )
ప్రియుడి ఘాతుకం.. కాబోయే భార్య కోసం ఐదుగురిని 10 అడుగులో గోతిలో..
X

దిశ, వెబ్‌డెస్క్: వారిద్దరూ ఎంతోకాలంగా ప్రేమించుకున్నారు. ఆమె, అతడే తన ప్రాణమని నమ్మింది. ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకోంది. కానీ ప్రియుడి మాత్రం వేరే యువతితో పెళ్లికి సిద్దమయ్యాడు. ఇది తట్టుకోలేని యువతీ ప్రియుడుకు కాబోయే భార్య ఫోటోను, ఫోన్ నెంబర్ ని సోషల్ మీడియా ఓ పోస్ట్ చేసింది. అదే ఆమె ప్రాణం తీసింది. ఆమెతో పాటు ఆమె కుటుంబాన్ని బాలి తీసుకుంది. ప్రేమించిన వాడే ఆమె పాలిట కాలయముడయ్యాడు. ప్రియురాలిని వదిలించుకోవడానికి ఆమెతో పాటు వారి ప్రేమ గురించి తెలిసిన మరో నలుగురును దారుణంగా హతమార్చి గొయ్యి తీసి పాతిపెట్టిన ఘటన మధ్యప్రదేశ్ లో వెలుగుచూసింది. వివరాలలోకి వెళితే..

నేమవర్ పట్టణానికి చెందిన రూపాలి అనే యువతి, అదే ప్రాంతానికి చెందిన సురేంద్ర చౌహాన్‌ ఇద్దరు గతకొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల సురేంద్ర మరో యువతితో పెళ్ళికి రెడీ అయ్యాడు. ఆ విషయం తెలుసుకున్న రూపాలి, సురేంద్ర ను నిలదీసింది. అతను ఆ యువతినే పెళ్లి చేసుకుంటానని తెగేసి చెప్పేసరికి కోపోద్రేకురాలైన రూపాలి ప్రియుడు కాబోయే భార్య ఫోటోలను, ఫోన్ నెంబర్ ని సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది.

ఇక ఈ విషయం తెలుసుకున్న సురేంద్ర, రూపాలి బతికి ఉంటే ఎప్పటికైనా ప్రమాదమే అనుకోని ఆమెను హతమార్చడానికి ప్లాన్ వేశాడు. ఈ క్రమంలోనే ఈ ఏడాది మే 13న రూపాలి తో పాటు సోదరుడు పవన్‌ ఓస్వాల్‌(13), తల్లి మమతా బాయి కాస్తే (45), చెల్లి దివ్య (14) తో పాటు బంధువుల అమ్మాయి పూజా ఓస్వాల్ (15)ని తీసుకొని తాను చెప్పిన ప్రాంతానికి రావాలని కోరాడు. ప్రియుడు చెప్పినట్లే కుటుంబాన్ని తీసుకొని రూపాలి ఒక నిర్మానుష్యమైన ప్రదేశానికి వెళ్ళింది. వారంతా అక్కడకు చేరుకున్న తర్వాత సురేంద్ర వారిని హత్య చేసి.. సమీప పొలంలో పది అడుగులు గొయ్యి తీసి.. మృతదేహాలను పూడ్చిపెట్టాడు.

ఐదుగురిని హత్య చేసి ఏమి తెలియని వాడిలా అక్కడినుంచి పరారయ్యాడు. రూపాలి కుటుంబం కనిపించకపోయేసరికి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టగా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. రూపాలి చనిపోయినట్లు తెలియకుండా ఆమె సోషల్ మీడియాలో తనకు పెళ్లి అయ్యిందని, తన కుటుంబ సభ్యులు తనతోనే ఉన్నట్లు నిందితుడు పోస్ట్ చేస్తుండేవాడు. అయితే ఈ విషయమై అనుమానించిన పోలీసులు రుపాలి ఫోన్ కాల్స్ ని ట్రేస్ చేయగా సురేంద్రకి ఎక్కువ కాల్స్ చేసినట్లు ఉండడంతో అతనిని అరెస్ట్ చేసి విచారించగా.. తానే తన ప్రియురాలిని, ఆమె కుటుంబాన్ని హతమార్చి పూడ్చి పెట్టినట్లు తెలిపాడు. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేశారు.

Advertisement

Next Story