మాధవన్‌కు కరోనా.. ‘3 ఇడియట్స్’ స్టైల్‌లో ఫన్నీ ట్వీట్

by Shyam |
మాధవన్‌కు కరోనా.. ‘3 ఇడియట్స్’ స్టైల్‌లో ఫన్నీ ట్వీట్
X

దిశ, సినిమా : బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్‌‌కు కరోనా పాజిటివ్ అని బుధవారమే ప్రకటించగా, ఇప్పుడు మాధవన్ కూడా కరోనా బారినపడ్డారు. ఈ మేరకు ఫ్రెండ్‌(అమీర్)ను ఎప్పుడూ ఫాలో అవుతుంటా కాబట్టి, తనకు కూడా కరోనా పాజిటివ్ వచ్చిందని ట్వీట్ చేశాడు మాధవన్. ‘త్రీ ఇడియట్స్‌’లో క్యారెక్టర్స్‌ను మెన్షన్ చేస్తూ.. ‘ఫర్హాన్(మాధవన్) రాంచో(అమీర్)ను ఫాలో అయ్యాడు. వారి తర్వాతే వైరస్(డీన్) ఉండాలి. కానీ ఈసారి వైరస్ క్యాచ్ చేశాడు. బట్ ‘ఆల్ ఈజ్ వెల్’. త్వరలో కొవిడ్ ‘వెల్(బావి)’లో ఉంటుంది. అయితే ఈ ప్లేస్‌లో రాజు(షర్మాన్ జోషి) ఉండాలని రాంచో, ఫర్హాన్ కోరుకోవడం లేదు. మాపై చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు. నేను కోలుకుంటున్నా’ అంటూ తనదైన స్టైల్‌లో మాధవ్ ట్వీట్ చేయగా.. స్పీడ్‌గా రికవరీ కావాలని కోరుకుంటున్నారు అభిమానులు.

https://twitter.com/ActorMadhavan/status/1374984964467384320?s=20

Advertisement

Next Story