విషాదం.. మద్దులపల్లి సర్పంచ్ ఆకస్మిక మృతి

by Shyam |
విషాదం.. మద్దులపల్లి సర్పంచ్ ఆకస్మిక మృతి
X

దిశ, కాటారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం మద్దలపల్లి సర్పంచ్ డోలి సమ్మక్క మంగళవారం ఆకస్మికంగా మరణించారు. మండలంలో నూతనంగా ఏర్పాటైన గ్రామ పంచాయతీకి సమ్మక్క తొలి మహిళ సర్పంచ్ కావడం విశేషం. మండల టీఆర్ఎస్ నాయకుడు మాజీ మండల శాఖ అధ్యక్షుడు డోలి అర్జయ్యకు డోలి సమ్మక్క తల్లి. మహిళా సర్పంచ్ సమ్మక్క అకాల మరణంతో మద్దులపల్లి గ్రామంలో విషాదం నెలకొంది. సర్పంచ్ సమ్మక్క మృతి పట్ల మండలంలోని పలువురు నాయకులు, కార్యకర్తలు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

Advertisement

Next Story