- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మలినంలో మసకబారిన బాలిక జీవితం.. ఆకర్షణే ఆయువు తీసిందా ?
దిశ, సినిమా : తాత ముత్తాతల నుంచి వారసత్వంగా దాపురిస్తున్న దరిద్రపు సంస్కృతే ‘కులం’. అణగారిన వర్గాలను కట్టుబానిసను చేసి.. తమను చూస్తేనే పాపమనే విషబీజాన్ని నాటి.. గొడ్డు కష్టం తప్ప జీతమెరుగని జీవితాన్నిచ్చిన ‘కులం’ ఆంక్షలకు తోడు ‘అంటరానితనం’ అనే ముద్రవేసింది. దళితుల్ని ముట్టుకుంటేనే మలినమైపోతామనే అగ్రవర్ణాలకు.. మరి అదే ఇంటి ఆడబిడ్డను అనుభవిస్తే పుణ్యమొస్తుందని ఎవరైనా చెప్పారా? చూసేందుకు కూడా పనికిరాని వారు కామవాంఛ తీర్చుకునేందుకు ఎలా పనికొచ్చారు? సహవాసానికే అక్కరకురాని మనుషులతో బలవంతపు సాన్నిహిత్యాన్ని ఎలా కోరుకున్నారు? వెలుగు పూట తమకు ఎదురుపడొద్దని హెచ్చరించిన పెద్దలు.. అదే కులానికి చెందిన మహిళపై పట్టపగలే అఘాయిత్యానికి ఒడిగట్టడం దేనికి సంకేతం? న్యాయం కోసం ఎదురుతిరిగితే ఊరంతా ఒక్కటై ఆ కులాన్ని అణిచివేయడం ఎంత వరకు కరెక్ట్? మరి ఇన్ని ఘాతుకాలను కళ్లారా చూసిన ప్రకృతి సిగ్గుతో తలదించుకుందా? లేదా బాధితురాలికి తనఒడిలో స్థానమిచ్చి పగతీర్చుకునేందుకు సాయం చేసిందా? అనే కాన్సెప్ట్‌తో వచ్చిన అన్‌ఫెయిరీ టేల్ ‘మాడతి’. జానపద కథే అయినా కులం గురించి కళ్లు తెరిపించే వాస్తవాలను ప్రజెంట్ చేసి, అనాదిగా వస్తున్న కులపిచ్చి ఎంతటి దారుణాలకు ఒడిగడుతుందో చూపించింది.
తమిళనాడులోని ఓ చిన్న గ్రామంలో‘పుతిరై వన్నార్’ కులానికి చెందిన దళిత కుటుంబం.. అక్కడి అగ్రవర్ణాలు విధించిన కట్టుబాట్లకు లోబడి ఊరికి దూరంగా, నదీతీరాన నివసిస్తుంటుంది. ఆ ఫ్యామిలీలో ఎవరైనా మరణిస్తే తప్ప వారికి ఆ నది దాటే అవకాశం ఉండదు. ఈ నది అణిచివేతకు చిహ్నం.. కానీ అమ్మా-నాన్న, నానమ్మతో పాటు కలిసి జీవిస్తున్న అమ్మాయి యోసనకు మాత్రం కులం అనే గుడ్డివాస్తవాల నుంచి విముక్తి మార్గం. గ్రామ కట్టుబాట్ల గురించి ఏ మాత్రం అవగాహన లేని ఫ్రీ బర్డ్. అడవిలో ఉన్న పక్షులు, జంతువులతో స్నేహం చేస్తూ.. స్వేచ్ఛగా విహరించే కల్మషం లేని అమ్మాయి. అయితే ఊరి పెద్దల కఠినత్వం, స్త్రీల పట్ల వారికున్న ధోరణి గురించి తెలిసిన తల్లి.. అడవిలో తిరగొద్దని తిడుతూనే ఉంటుంది. కానీ యోసనకు ఇవేవీ పట్టవు. ఈ క్రమంలోనే ఒకరోజు నదిలో స్నానం చేస్తుండగా, అదే గ్రామానికి చెందిన యువకుడు శరీరం మీద నూలు పోగు కూడా నదిలో ఈత కొట్టడాన్ని చూస్తుంది. ఒక పురుషుడిని తొలిసారిగా అలా చూసిన యోసన అట్రాక్ట్ అవుతుంది. అవే దృశ్యాలను ఊహించుకుంటూ తనను మరోసారి చూడాలని ఆరాటపడుతుంది. నిజానికి ఒక పెద్ద కులానికి చెందిన పురుషుడి గురించి అలా ఆలోచించవచ్చో లేదో కూడా తెలియని అమాయకురాలు తను.
ఇక అగ్ర కులాలకు చెందిన మహిళల పీరియడ్స్ టైమ్ బట్టలు ఉతకడం, చనిపోయిన వారిని పూడ్చిపెట్టేందుకు శ్మశానంలో బొంద తవ్వడం యోసన తల్లిదండ్రుల పని. ఇందుకోసం పెద్ద కులం దయతలిచి ఇచ్చినంత చిల్లర పుచ్చుకోవాలే తప్ప, ప్రశ్నించడానికి వీల్లేదు. ఈ క్రమంలో తన బిడ్డ కూడా భవిష్యత్తులో తనలాంటి జీవితాన్నే అనుభవిస్తుందని తలచుకుని యోసన తల్లి బాధపడని రోజు ఉండదు. అయితే తండ్రికి మాత్రం ఇవేవీ పట్టవు. బట్టలు ఉతికామా.. మందు తాగామా.. తిన్నామా.. పడుకున్నామా? ఆయనకు తెలిసింది ఇంతే!
మరోవైపు ఊరిలో అమ్మవారి విగ్రహ స్థాపనకు గ్రామపెద్ద విరాళాలు సేకరించగా.. ఎవరెవరు ఎంత ఇచ్చారనే విషయాన్ని అందరి సమక్షంలో చదివి వినిపిస్తారు. అయితే ఈ విరాళాలు తీసుకొచ్చిన యువకుడు(యోసన ఇష్టపడిన అబ్బాయి) రికార్డులో తప్పులున్నాయని, దాతలు ఎక్కువ మొత్తంలో చెల్లిస్తే తప్పుడు లెక్కలు ఎందుకు నమోదు చేశారని ప్రశ్నిస్తాడు. దానికి పుస్తకంలో నమోదు చేసిందే చదివామని సమాధానమిస్తాడు ఊరిపెద్ద. కాగా పుస్తకంలో లెక్కలు రాసిన తన స్నేహితుడే డబ్బులు నొక్కేశాడని యువకుడు ఘర్షణకు దిగుతాడు. దీంతో కనీస గౌరవం ఇవ్వకుండా తనముందే కొట్లాడుతారా? అంటూ ఊరిపెద్ద ఇద్దరికీ జరిమానా విధిస్తాడు. ఇక విగ్రహ ప్రతిష్టాపన రోజున ఊరంతా ఉత్సవాల్లో మునిగిపోతే, కొందరు యువకులు కలిసి ఊరి చివర తాగుతుంటారు.
ఇదే క్రమంలో విరాళాల డబ్బులు నొక్కేసింది ఊరిపెద్దే అని, అనవసరంగా తమకు జరిమానా విధించాడని తెలుసుకున్న యువకులు.. అతడి భార్యను రేప్ చేసి కక్ష తీర్చుకోవాలని చర్చించుకుంటారు. సరిగ్గా అదే సమయానికి ఆ యువకుడిని చూసేందుకు ఆరాటపడుతున్న యోసన అక్కడకు చేరుకుంటుంది. అప్పటికే మత్తులో తూగుతూ ఎవరైనా అమ్మాయి దొరికితే బాగుండు, అఘాయిత్యం చేద్దామనుకుంటున్న యువకుల కంటపడిన యోసనపై గ్యాంగ్ రేప్ చేసి హత్య చేస్తారు. నిర్జీవంగా పడిఉన్న యోసనను తీసుకొని నది దాటిన తల్లిదండ్రులు.. తనను ఊరి మధ్యకు తీసుకొచ్చి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తారు. కానీ న్యాయం సంగతి పక్కనబెడితే, ఊరంతా కలిసి వీరిపైనే అన్యాయంగా దాడి చేస్తారు. ఈ అమానుష ఘటనకు తల్లడిల్లిన ప్రకృతి కుండపోత వర్షం కురిపించడంతో ఊరంతా కొట్టుకుపోయి, ప్రజలంతా గుడ్డివారైపోతారు. గ్రామంలో ప్రతిష్టించిన అమ్మవారి విగ్రహం యోసన రూపంలోకి మారుతుంది. ఈ క్రమంలో ‘మాడతి’గా పూజలు అందుకుంటుంది. అయితే అణగారిన వర్గాల సమస్యలపై ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చినా.. ప్రతీ శూద్ర దేవత పుట్టుక వెనుక ఆ జాతిలో అన్యాయానికి గురైన మహిళ చరిత్ర దాగుందనే సత్యాన్ని విప్పి చెప్పింది ‘మాడతి’.