MAA Elections 2021: 'మా' ఫైట్ కి సిద్దమైన ప్రకాష్ రాజ్.. పోటీపడేది వీరే

by Shyam |   ( Updated:2021-06-24 05:37:36.0  )
maa elections news
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ లో ‘మా’ ఎన్నికలు అగ్గిరాజేస్తున్నాయి. ఎలక్షన్స్ కి ఇంకా 3 నెలలు ఉన్నా ఇప్పటినుంచే హాట్ సీట్ కోసం పోటీ ముమ్మరం అయ్యింది. ఇక ఇప్పటికే టాలీవుడ్ లో రెండు వర్గాలుగా చీలిపోయిన సినీ ప్రముఖులు తమ మద్దతు ఎవరెవరికి ఇవ్వాలో లెక్కలు వేసేస్తున్నారు. అధ్యక్ష పోటీలో బరిలోకి దిగుతున్నట్లు ఇప్పటికే సీనియర్‌ నటుడు ప్రకాశ్‌రాజ్‌, హీరో మంచు విష్ణు, నటీమణులు జీవితా రాజశేఖర్‌, హేమ ప్రకటించారు. దీంతో ఈ ఎన్నికలు నాలుగుస్తంభాలాటగా మారిపోయింది. దీంతో మునుపెన్నడూ లేని విధంగా ‘మా’ ఎన్నికలపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఇక ఈ ఎన్నికల్లో చురుగ్గా పాములు కదుపుతున్న ప్రకాష్ రాజ్ ఒకడుగు ముందుకేసి తన ప్యానెల్ సభ్యుల వివరాలను ప్రకటించారు. ప్రస్తుతం ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యుల పేర్లు నెట్టింట వైరల్ గా మారాయి. మొత్తం 27మందితో ఈ జాబితాను విడుదల చేసిన ప్రకాష్ విజయం తమ వైపే ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.

“త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే MAA ఎల‌క్ష‌న్స్‌ని పుర‌స్క‌రించుకుని, ‘మా’ శ్రేయ‌స్సు దృష్ట్యా.. నిర్మాణాత్మ‌క ఆలోచ‌న‌ల‌ని ఆచ‌ర‌ణ‌లో పెట్టే దిశ‌గా మా ప్ర‌తిష్ట‌కోసం.. మ‌న న‌టీనటుల బాగోగుల కోసం.. సినిమా న‌టీన‌టులంద‌రి ఆశీస్సుల‌తో.. అండ‌దండ‌ల‌తో.. ఎన్నిక‌ల‌లో నిల‌బ‌డటం కోసం.. ప‌ద‌వులు కాదు ప‌నులు మాత్ర‌మే చేయ‌డం కోసం.. ‘మా’ టీంతో రాబోతున్న విష‌యాన్ని తెలియ‌ప‌రుస్తున్నామని ప్రేక్ష రాజ్ తెలిపారు.

ప్రకాష్రాజ్‌ ప్యానల్‌ సభ్యులు వీరే

1. ప్ర‌కాష్‌రాజ్‌
2. జ‌య‌సుధ‌
3. శ్రీకాంత్‌
4. బెన‌ర్జీ
5. సాయికుమార్‌
6. తనీష్‌
7. ప్ర‌గ‌తి
8. అన‌సూయ‌
9. స‌న
10. అనిత చౌద‌రి
11. సుధ‌
12. అజ‌య్‌
13. నాగినీడు
14. బ్ర‌హ్మాజీ
15. ర‌విప్ర‌కాష్‌
16. స‌మీర్‌
17. ఉత్తేజ్
18. బండ్ల గణేష్
19. ఏడిద శ్రీరామ్‌
20. శివారెడ్డి
21. భూపాల్‌
22. టార్జ‌ాన్‌
23. సురేష్ కొండేటి
24. ఖ‌య్యుం
25. సుడిగాలి సుధీర్
26. గోవింద‌రావు
27. శ్రీధ‌ర్‌రావు & మ‌రికొంద‌రు ప్ర‌ముఖుల‌తో రానున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story