- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మార్కెట్లో దూసుకుపోతున్న టీసీఎస్.. విలువ ఎంతంటే?
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ ఐటీ సంస్థల్లో ఒకటైన టాటా కన్సల్టెన్సీ సర్వీస్(టీసీఎస్) అరుదైన ఘనతను సాధించింది. మంగళవారం నాటి ట్రేడింగ్‌లో కంపెనీ షేర్లు 2.30 శాతం పెరిగి రూ. 3,786.55 వద్ద ట్రేడవ్వడంతో సంస్థ మార్కెట్ విలువ రూ. 14 లక్షల కోట్ల మార్కును అధిగమించింది. దేశీయ మరో ప్రైవేట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ తర్వాత ఈ మైలురాయిని సాధించిన రెండో కంపెనీగా టీసీఎస్ రికార్డు నమోదు చేసింది. టీసీఎస్ షేర్లు గణనీయమైన లాభాలతో ర్యాలీ చేయడంతో మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 14,00,664.30 కోట్లకు పెరిగింది.
ఈ ఏడాది జనవరిలో టీసీఎస్ కంపెనీ రూ. 12 లక్షల కోట్ల మార్కును, ఈ నెలలో 17వ తేదీన టీసీఎస్ సంస్థ మొదటిసారిగా రూ. 13 లక్షల కోట్ల మైలురాయిని దాటింది. ప్రస్తుతం రూ. 14,32,270.38 కోట్ల మార్కెట్ విలువతో దేశంలోనే అత్యంత విలువైన సంస్థగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అగ్రస్థానంలో ఉంది. కాగా, ఈ ఏడాది ప్రారంభం నుంచి టీసీఎస్ సంస్థ షేర్లు దాదాపు 32 శాతం లాభపడ్డాయి.