కీర్తి సురేష్ పెళ్లి.. డ్యాన్స్‌తో అదరగొట్టిన రజినీకాంత్, ఖుష్బూ, మీనా..

by Shyam |   ( Updated:2021-11-03 05:24:28.0  )
కీర్తి సురేష్ పెళ్లి.. డ్యాన్స్‌తో అదరగొట్టిన రజినీకాంత్, ఖుష్బూ, మీనా..
X

దిశ, సినిమా: శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్, నయనతార జంటగా తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘పెద్దన్న’. తమిళ్ ఫిల్మ్ ‘అన్నాత్తె’కు డబ్బింగ్ వెర్షన్‌గా వస్తున్న ఈ సినిమా దీపావళికి విడుదల కానుంది. అన్నాచెల్లెళ్ల మధ్య అనుబంధం నేపథ్యంలో సాగే యాక్షన్ మూవీకి సంబంధించి ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, లిరికల్ సాంగ్‌కు మంచి స్పందన లభించింది. ఈ క్రమంలోనే ‘పెద్దన్న’ సినిమా నుంచి మరో లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు మేకర్స్. ‘ఆహా కళ్యాణం’ అంటూ ఉత్సాహంగా సాగే ఈ పాటకు డి. ఇమాన్ సంగీత సమకూర్చగా రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. కాగా ఈ చిత్రంలో రజినీ చెల్లెలిగా కీర్తి సురేష్ నటించస్తుండగా ఆమె పెళ్లి సందర్బంగా ఈ పాటను తెరకెక్కించారు. ఈ సాంగ్‌లో రజినీ, ఖుష్ఫూ, మీనా, కీర్తి సురేశ్ డ్యాన్స్ స్టెప్స్ ఆకట్టుకుంటుండగా.. ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా రికార్డు స్థాయి థియేటర్స్‌లో విడుదల చేయబోతున్నారు.

Advertisement

Next Story

Most Viewed