సోనాక్షి అలాంటి గేమ్స్ ప్లే చేయలేదు : లవ్ సిన్హా

by Jakkula Samataha |
సోనాక్షి అలాంటి గేమ్స్ ప్లే చేయలేదు : లవ్ సిన్హా
X

దిశ, సినిమా : బాలీవుడ్ నటుడు శతృఘ్నసిన్హా పిల్లలు.. సోనాక్షి సిన్హా, లవ్ సిన్హా 2010లో ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. ఫస్ట్ ఫిల్మ్ ‘దబాంగ్’ ద్వారా సోనాక్షి బ్లాక్ బస్టర్ హిట్ అందుకోగా.. ‘సాడియా’ చిత్రం ద్వారా డిజాస్టర్ చవిచూశాడు లవ్ సిన్హా. కాగా లేటెస్ట్ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని గురించి ప్రస్తావించిన హీరో.. ఈ విషయంలో సోనాక్షిని చూస్తే గర్వంగా ఉంటుందని తెలిపాడు. తను ఈ విధంగా కుటుంబ వారసత్వాన్ని ముందుకు తీసుకుపోతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. తను కూడా భవిష్యత్తులో ఫ్యామిలీ లెగసీని ముందుకు తీసుకెళ్తాననే నమ్మకంతో ఉన్నట్లు చెప్పాడు. ఒకవేళ తనకు కూడా ఫస్ట్ సినిమా బ్లాక్ బస్టర్ అయి ఉంటే సోదరితో కంపేర్ చేసి ఉండరు కదా అన్న లవ్ సిన్హా.. తండ్రితో కూడా పోల్చడం సరికాదన్నారు. ఎందుకంటే తన టైమ్ డిఫరెంట్, తన ప్రయాణం భిన్నమైందని తెలిపాడు.

ఇక సోనాక్షి తను నెంబర్ వన్ అని ప్రూవ్ చేసుకునేందుకు పీఆర్ గేమ్‌లో పడిపోనందుకు, సెలెక్టివ్ ప్రాజెక్ట్‌లు ఎంచుకుంటున్నందుకు గర్వంగా ఉందన్నాడు లవ్ సిన్హా. బ్యాక్ టు బ్యాక్ బిగ్గెస్ట్ హిట్స్ అందుకున్నా తనెప్పుడూ నంబర్ వన్ అని ప్రకటించుకోలేదని తెలిపాడు. తన పని తాను చేసుకునేందుకు మాత్రమే ఇష్టపడుతుందని.. ర్యాట్ రేస్‌, నంబర్ గేమ్స్ లాంటి వాటిని అస్సలు పట్టించుకోదని తెలిపాడు లవ్ సిన్హా.

Advertisement

Next Story