- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
భారీగా తగ్గిన గ్యాస్ ధరలు!
దిశ, వెబ్‌డెస్క్: లాక్‌డౌన్ దెబ్బకు ప్రజలంతా ఇళ్లలో ఉండి రకరకాల వంటలు చేసుకుని గడిపేస్తున్నారు. ఇలాంటి సమయంలో గ్యాస్ వినియోగదారులకు శుభవార్త. శుక్రవారం గ్యాస్ సిలిండర్ ధర భారీగా తగ్గింది. ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ. 214 వరకూ తగ్గింది. కమర్షియల్ ఎల్‌పీజీ(19 కిలోలు) ధర రూ. 336 తగ్గింది. మే 1 నుంచి కొత్త ధరలు అమల్లోకి వస్తాయి.
తగ్గిన ధరలతో ఎల్‌పీజీ సిలిండర్(14 కిలోలు) రూ. 583 కి చేరింది. కమర్షియల్ ఎల్‌పీజీ(19 కిలోలు) ధర రూ. 988 గా ఉండనుంది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరల క్షీణత ప్రభావంతో గ్యాస్ ధరలు తగ్గాయి. గ్యాస్ ధరలైతే తగ్గాయి కానీ ఇంధన ధరలు కొంచెమైనా తగ్గడంలేదు. మార్చి 15 నుంచి ఇంధన ధరల్లో ఎటువంటి మారుపులు లేవు. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఎల్‌పీజీ సిలిండర్ ధరలు…ఢిల్లీలో రూ. 744 నుంచి రూ. 611 కు తగ్గింది. కోల్‌కతాలో రూ. 839 నుంచి రూ. 774కు చేరింది. ముంబైలో రూ. 579కి తగ్గగా, చెన్నైలో రూ. 761 నుంచి రూ. 569కి తగ్గింది. హైదరాబాద్‌లో రూ. 862 నుంచి రూ. 796కి చేరింది.
అంతర్జాతీయ మార్కెట్లను అనుసరించి గ్యాస్ సిలిండర్ ధరల్లో ప్రతి నెలా మార్పులు జరుగుతూ ఉంటాయి. క్రూడాయిల్ ధరలతో పాటు రూపాయి మారకం విలువపై ఆధారపడి ఎల్‌పీజీ ధర మారుతూ ఉంటుంది. ప్రతి నెలా ఒకటో తేదీన గ్యాస్ సంస్థలు ఎల్‌పీజీ గ్యాస్ ధరలను సవరిస్తాయి.
Tags: LPG, gas cylinder, gas cylinder price, hyderabad, delhi