- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
RGV మెచ్చాడు : టీ తాగేందుకు చిల్లిగవ్వలేకపోయినా.. 6 నెలల్లోనే బిలియనీర్..!
దిశ, సినిమా : పాండమిక్ టైమ్ కొన్ని కుటుంబాలను దుర్భర పరిస్థితుల్లోకి నెట్టింది. ఎంతో మంది హాస్పిటల్ బిల్లు చెల్లించలేక ఆస్తులు అమ్ముకుని రోడ్డున పడితే.. మరికొంత మందికి పైసలు లేక పూటగడవని పరిస్థితి నెలకొంది. కానీ అలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ చదువు కూడా సరిగ్గాలేని ఓ దిగువ మధ్యతరగతి యువకుడు బిలియనీర్ ఎలా అయ్యాడు? అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన షార్ట్ ఫిల్మ్ ‘బూడిదలో పోసిన పన్నీరు’.
కొవిడ్ ఫస్ట్ వేవ్ కన్నా సెకండ్ వేవ్ తీవ్రత ఎక్కువ ఉంది. కరోనా మరణాలను అదుపుచేయడంలో భారత ప్రభుత్వం విఫలమైంది. భయంతో కనీసం శవాలను కాల్చేందుకు కూడా మనుషులు దొరకని పరిస్థితి. అలాంటి సమయంలో ఓ కాలేజీకి సెక్యూరిటీ గార్డుగా ఉన్న యువకుడికి ఓ కాంట్రాక్ట్ వస్తుంది. టీ బిల్లు చెల్లించేందుకు పది రూపాయలు కూడా లేని ఆ వ్యక్తికి లైఫ్ టర్న్ అయ్యే ఆఫర్. ఇంతకీ జీవితం మలుపు ఆ తిరిగే చాన్స్ ఏంటో తెలుసా?.. కొవిడ్‌తో చనిపోయిన వ్యక్తి శవాన్ని కాల్చేస్తే అక్షరాల రూ.25 వేలు చేతిలో పడినట్లే.
ఎలాగూ పేదరికంతో బాధపడుతున్నాడు కాబట్టి ఈ కాంట్రాక్ట్‌కు వెంటనే ఓకే చెప్పిన యువకుడు.. కొవిడ్ ప్రికాషన్స్ తీసుకుంటూ రోజుకు వందల్లో శవాలను కాలుస్తాడు. కరోనా వస్తే పోయేవాడేమో కానీ.. చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ కేవలం ఆరునెలల్లో ఇండియన్ రిచెస్ట్ పర్సన్స్‌లో ఒక్కడిగా ఎదుగుతాడు. చేతిలో చిల్లిగవ్వ లేని స్థితి నుంచి బిలియనీర్‌గా ఎదిగిన ఈ సక్సెస్ స్టోరీ.. ఆర్జీవీ స్పార్క్ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్‌లో ఫస్ట్ ప్లేస్‌లో నిలవడం విశేషం.