ప్రేమజంట ఆత్మహత్యాయత్నం

by Sumithra |   ( Updated:2020-05-27 09:54:44.0  )
ప్రేమజంట ఆత్మహత్యాయత్నం
X

దిశ, నల్లగొండ :
ఓ ప్రేమజంట ఆత్మహత్యకు యత్నించింది. తమ ప్రేమను ఇంట్లో పెద్దలు ఒప్పుకోకపోగా, విడదీసేందుకు తల్లిదండ్రులు ప్రయత్నించారని మనస్తాపం చెంది పురుగుల మందు తాగారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం షాపెల్లి గ్రామానికి చెందిన అక్కినపల్లి అరుణ్, వెన్నెల గత రెండేండ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ వ్యవహారం ఇరుకుటుంబాలకు తెలియడంతో వారిని విడదీసేందుకు ప్రయత్నించారు. వారి పెళ్లికి అంగీకరించలేదు. ఇంట్లోనే నిర్బంధించారు. ఎన్నిమార్లు బ్రతిమిలాడినా ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించలేదు. ఈ క్రమంలో నకిరేకల్‌కు వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. అటుగా వెళుతున్న పాదాచారులు వీరిని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి వారిని 108 వాహనంలో నల్లగొండ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.

Advertisement

Next Story