ప్రేమికులు ఆత్మహత్య.. మరుసటి రోజు స్నేహితురాలు కూడా..

by Anukaran |   ( Updated:2020-07-19 05:27:35.0  )
ప్రేమికులు ఆత్మహత్య.. మరుసటి రోజు స్నేహితురాలు కూడా..
X

దిశ, వెబ్‌డెస్క్: పెద్దలు అంగీకరించలేదని ప్రేమికులు ఆత్మహత్యలు చేసుకోవడం కామన్ విషయమే. ఈ మధ్య కాలంలో ఇది మరింతగా పెరిగింది. ఈ నేపథ్యంలోనే పెద్దలు ఒప్పుకోలేదని ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇది జరిగిన కొద్దిగంటల్లోనే మృతురాలి స్నేహితురాలు కూడా ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్‌లో లాంజీలో సంచలనం రేపింది.

వివరాల్లోకివెళితే.. లాంజీకి చెందిన రాజేష్ అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన సగుంటబాయిని ప్రేమించాడు. పెళ్లి చేసుకుందామని అనుకున్నారు. కానీ, అందుకు పెద్దలు అంగీకరించలేదు. ఈ క్రమంలోనే రాజేష్ ఈనెల 12వ తేదీన ఆత్మహత్య చేసుకున్నాడు. అతని మరణవార్త వినగానే ప్రియురాలు సగుంటబాయి మనస్తాపం చెంది జులై 16న ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన జరిగిన మరుసటి రోజే సగుంటబాబు స్నేహితురాలు జానకి కూడా ఆత్మహత్యకు పాల్పడింది. ఒకే గ్రామంలో వరుసగా ముగ్గురు సూసైడ్ చేసుకోవడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Advertisement

Next Story