- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి.. అలా చేసిన తల్లిదండ్రులు
దిశ, ఏపీ బ్యూరో: ఆ ఇద్దరూ ప్రేమించుకున్నారు. కులాలు వేరుకావడంతో పెళ్లికి ఇరుకుటుంబాల పెద్దలు ఒప్పుకోలేదు. దీంతో పది రోజుల క్రితం ఓ గుడిలో పెళ్లి చేసుకుని స్వగ్రామానికి వెళ్లగా ఇరుకుటుంబ సభ్యులు వధువు, వరుడులను వేర్వేరుగా తీసుకెళ్లిపోయారు. అయితే శనివారం ఇద్దరూ ఇంటి నుంచి వెళ్లిపోయి మరో గుడిలో పెళ్లి చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు నవదంపతులను గుడిలో నిర్బంధించారు. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే ఇందుకూరుపేట మండలం గంగపట్నంకు చెందిన శ్రావణ్, సాయి శిరీష కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కులాలు వేరు కావడంతో పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. పది రోజుల క్రితం జొన్నవాడలో వివాహం చేసుకున్న ఇద్దరు స్వగ్రామానికి వచ్చారు.
వీరి పెళ్లి తల్లిదండ్రులకు నచ్చకపోవడంతో ఇరు కులాలకు చెందిన పెద్దలు ఇద్దర్నీ ఎవరింటికి వారిని పంపించేశారు. తాజాగా శనివారం ఇద్దరూ పల్లెపాలమ్మ ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఇరుకుటుంబాల సభ్యులు గుడి వద్దకు చేరుకున్నారు. సాయి శిరీష తండ్రి పెళ్లి ఆపి తన కూతురును తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. తండ్రితో వెళ్లేందుకు యువతి అంగీకరించలేదు. దీంతో వరుడితో వాగ్వాదానికి దిగగా అతడి తరపు బంధువులు అడ్డుకున్నారు. దీంతో పెళ్లి కొడుకు, పెళ్లి కుమార్తె బంధువులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో నవదంపతులను ఆలయమంలోనే నిర్బంధించారు. ఈ ఘటన జిల్లాలో సంచలనంగా మారింది. అయితే స్థానికంగా ఉండే కొందరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. నవ దంపతుల తల్లిదండ్రులకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు.