కలిసి బతకలేమని కనుమరుగయ్యారు

by Shyam |
కలిసి బతకలేమని కనుమరుగయ్యారు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రేమించుకున్నాము.. మాకు పెళ్లి చేయండి అంటే తల్లిదండ్రులు నిరాకరించారు. దీంతో ఆ ప్రేమ జంట చనిపోయేందుకు నిర్ణయించకున్నారు. కలిసి బతక లేము అని తెలిసి కలిసే చనిపోదామనుకున్నారు. పురుగుల మందు తాగి ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్న హృదయవిధారక ఘటన హైదరాబాద్‌లో వెలుగు చూసింది.

వివరాళ్లోకి వెళితే.. వరంగల్ జిల్లా దేవరుప్పుల మండలం కోల్కొండ గ్రామానికి చెందిన అజయ్.. ఉప్పల్ బజాజ్ వెహికిల్ షోరూంలో పనిచేస్తున్నాడు. ఇదే క్రమంలో ఫిర్జాదిగూడ‌కు చెందిన శ్రావణితో పరిచయం ఏర్పడింది. శ్రావణి కూడా ఉప్పల్ బిగ్ బజార్‌లో సేల్స్ గార్ల్ పనిచేస్తోంది. అయితే, ఇద్దరు పనిచేసే సంస్థలు కూడా కొద్దిదూరంలోనే ఉండడంతో వీరద్దరి మధ్య పరిచయం పెరిగి.. ప్రేమకు దారి తీసింది. ఈ నేపథ్యంలోనే గత రెండేళ్ల నుంచి వీరి ప్రేమ మరింత బలపడింది. దీంతో ఇద్దరు వివాహం చేసుకుందామని అనుకున్నారు. ఇదే విషయం ఇంట్లో చెప్పారు. అమ్మాయి ఇంట్లో ఒప్పుకున్న అబ్బాయి ఇంట్లో నిరాకరించారు.

దీంతో మంగళవారం ఇంట్లో తెలియకుండా ఇద్దరూ బయటకు వచ్చేశారు. అక్కడే దగ్గరలోని మేడిపల్లిలో ఓయో హోటల్‌లో రూం అద్దెకు తీసుకున్నారు. కలిసి చనిపోదాం అని డిసైడ్ అయిన వారు.. తమతో పాటే తెచ్చుకున్న విషం తాగేశారు. అయితే, ఎంతకీ డోర్ తెరవకపోవడంతో హోటల్ నిర్వహకుడు వెళ్లి చూడగా ఆత్మహత్యకు యత్నించినట్లు గ్రహించాడు. దీంతో పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శ్రావణి అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. కొన ప్రాణాలతో ఉన్న అజయ్‌కు ఉప్పల్‌లోని ఓ ప్రైయివేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే బుధవారం చికిత్స పొందుతు ప్రియుడు కూడా మృతి చెందాడు. పిల్లల ఆత్మహత్యతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Advertisement

Next Story