- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం.. ప్రియురాలు మృతి
దిశ నిజామాబాద్ రూరల్ : ప్రేమ గుడ్డిది అనడంలో అతిశయోక్తి లేదు. పెద్దలను ఒప్పించి ఏడడుగులు నడిచి దాంపత్య జీవితాన్ని సంతోషంగా పిల్లాపాపలతో గడపాలనుకున్న ప్రేమ జంట.. పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ప్రియురాలు మృతిచెందగా ప్రియుడి పరిస్థితి పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషాద ఘటన నిజామాబాద్ జిల్లా రూరల్ నియోజకవర్గం సిరికొండ మండలం ప౦దిమడుగు గ్రామంలో చోటుచేసుకుంది.
ఎస్సై రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం..పంది మడుగు గ్రామానికి చెందిన వందన (20 ), చింతల తాండాకు చెందిన సుభాష్ (21) తో గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరి కులాలు వేరైనప్పటికీ తరచూ సిరికొండ మండలంలో కలుసుకునేవారని రాజశేఖర్ తెలిపారు. అయితే వీరి ప్రేమ విషయం కాస్తా పెద్దలకు తెలిసింది. వారు.. వీరి ప్రేమకు నో చెప్పడంతో.. వారు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటనలో వందన మృతి చెందగా సుభాష్ పరిస్థితి విషమంగా ఉందని ఎస్సై తెలిపారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజశేఖర్ పేర్కొన్నారు.