- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రియురాలి హత్య.. పెన్నుపేపర్ అడిగిన ప్రియుడు!
దిశ, వెబ్‌డెస్క్ : వేర్వేరు కంపెనీలో పనిచేస్తున్న ఇద్దరు ప్రేమించుకున్నారు.ఆపై ఒకే ఇంట్లో ఉంటూ సహజీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె గర్భం దాల్చింది. అబార్షన్ చేయించడానికి అతని వద్ద డబ్బుల్లేవు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య గొడవలు తలెత్తడంతో సహనం కోల్పోయిన ప్రియుడు గర్భంతో ఉన్నదనే దయచూపకుండా ప్రియురాలి గొంతు నులిమి హత్యచేశాడు.అనంతరం నేరుగా పీఎస్‌కు వెళ్లి పెన్ను పేపర్ అడిగాడు. ఎందుకు అని అడిగేలోపు.. పోలీసులకు ఇంటి తాళాలు ఇచ్చి తన ప్రియురాలని మర్డర్ చేశానని.. వెళ్లి చూసుకోవాలని వెల్లడించాడు. అక్కడి వెళ్లి చూసే సరికి ఆ మహిళ విగతజీవిగా పడియుంది. ఈ అమానుష ఘటన మహారాష్ట్రలో ఆలస్యంగా వెలుచూసింది.
వివరాల్లోకివెళితే.. పూణె జిల్లా రంజన్‌గావ్ ఏరియా కోరేగావ్‌కు చెందిన కిరణ్ ఫుండెకు సోరెన్(24)తో పరిచయం ఏర్పడింది. వేర్వేరు కంపెనీల్లో పనిచేస్తున్న ఇద్దరూ కొద్దినెలలుగా సహజీవనం చేస్తున్నారు. ప్రియురాలు గర్భం దాల్చడంతో అబార్షన్ చేయించాలనుకున్నాడు. అతని వద్ద డబ్బులు లేకపోవడంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ప్రియురాలు నిత్యం గొడవ పెడుతుండటంతో సహనం కోల్పోయిన ప్రియుడు ఆమె గొంతు నులిమి హత్యచేశాడు.
అనంతరం రంజన్‌గావ్ పోలీస్ స్టేషన్‌కి వెళ్లి లొంగిపోయాడు. తన ప్రియురాలిని చంపేశానని చెప్పి.. పోలీసులును పెన్ను, పేపర్ అడగడంతో అందరూ షాకయ్యారు. తాను డిప్రెషన్‌తో బాధపడుతున్నానని.. అందువల్లే తన ప్రియురాలని హత్యచేశానని పేపర్‌పై రాసిచ్చాడు. అతని ఇంటికి వెళ్లిన పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శుభాంగి కుటె వెల్లడించారు.