గంటలో పెళ్లి.. ప్రియుడికి షాకిచ్చిన ప్రియురాలు!

by Sumithra |
గంటలో పెళ్లి.. ప్రియుడికి షాకిచ్చిన ప్రియురాలు!
X

దిశ,వెబ్‌డెస్క్ : ఇంకో గంటలో తన ప్రియుడికి వేరే అమ్మాయికి పెళ్లి జరగాల్సిఉంది. విషయం తెలుసుకున్న ప్రియురాలు అందరు అమ్మాయిల్లాగా ప్రియుడి కోసం ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించలేదు. ప్రియుడి ఇంటి ముందు ధర్నాకు దిగలేదు, తనకు న్యాయం చేయాలని నానా రభస చేయలేదు. పెళ్లి జరిగే ప్రదేశానికి వెళ్లి అతని కోసం రచ్చ చేయలేదు. కొత్తగా ఆలోచించింది. దీంతో వెంటనే పెళ్లి ఆగిపోవడమే కాకుండా, ప్రియుడిని పోలీసులు స్టేషన్‌కు తరలించారు. ఇంతకు ఆమె చేసిన పని ఎంటంటే.. ‘పెళ్లికూతురు మైనర్ అని పోలీసులకు అబద్ధపు ఫిర్యాదు ఇవ్వడమే’.

అంతే, ఆ ఒక్క కాల్‌తో ప్రియుడు తనను మోసం చేసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోకుండా అడ్డుకుంది.ఈ వింతైన ఘటన సికింద్రాబాద్‌లోని వెస్లీ చర్చిలో బుధవారం సాయంత్రం వెలుగులోకి వచ్చింది. తీరా తన ప్రియుడిని స్టేషన్‌కు తీసుకొచ్చాక అక్కడే ప్రియురాలు అసలు విషయం చెప్పింది. ఇన్ని రోజులు తనను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని చెప్పి వేరే అమ్మాయిని చేసుకోడానికి సిద్ధపడ్డ అతనిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరింది. ఈ మేరకు విచారణ ప్రారంభించి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. కాగా, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed