'లవ్ స్టోరి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..

by Shyam |   ( Updated:2021-08-18 02:27:39.0  )
లవ్ స్టోరి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..
X

దిశ, సినిమా : నాగచైతన్య – సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘లవ్ స్టోరి’. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రం.. కరోనా కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పరిస్థితులు నార్మల్ కావడంతో న్యూ రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 10న సినిమాను థియేటర్స్‌లో విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ సారి వినాయక చవితి ఎక్స్‌ట్రా స్పెషల్‌గా ఉంటుందంటూ రిలీజ్ డేట్ పోస్టర్‌ను షేర్ చేశారు. పవన్ సీహెచ్ సంగీతం సమకూర్చిన చిత్రంలోని పాటలు ఇప్పటికే సూపర్ హిట్ అయ్యాయి.

Advertisement

Next Story