'లవ్ స్టోరీ' ప్రోగ్రెస్

by Shyam |
లవ్ స్టోరీ ప్రోగ్రెస్
X

దిశ, వెబ్ డెస్క్: నాగ చైతన్య అక్కినేని, సాయి పల్లవి జంటగా నటిస్తున్న చిత్రం లవ్ స్టోరీ. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న సినిమా షూటింగ్ కరోనా కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. కాగా పరిస్థితులు కాస్త మెరుగవడంతో సోమవారం నుంచి మళ్లీ షూటింగ్ ప్రారంభించింది మూవీ యూనిట్. సింగిల్ షెడ్యూల్‌లో షూటింగ్ కంప్లీట్ కానుండగా.. చాలా కొద్ది మంది కాస్ట్ అండ్ క్రూ షూటింగ్‌కు హాజరయ్యారు. అన్ని జాగ్రత్తలు పాటిస్తూ చిత్రీకరణ జరిపినట్లు మూవీ యూనిట్ ఓ వీడియో కూడా విడుదల చేసింది.

కాగా ఇప్పటికే లవ్ స్టోరీ నుంచి విడుదలైన ‘హేయ్ పిల్లా’ సాంగ్ సూపర్ సక్సెస్ కాగా.. సాయి పల్లవి లుక్, చైతు యాక్టింగ్‌కు ఆడియన్స్ ఫిదా అయ్యారు. అమిగోస్ క్రియేషన్స్, శ్రీ వేంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై నారాయణ్ దాస్ నారంగ్, పి. రామ్ మోహన్ రావు నిర్మిస్తున్న సినిమాకు పవన్. సీహెచ్ సంగీతం అందిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed