- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా పేషెంట్లు.. భార్యభర్తలు అయ్యారు!
దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ అంటేనే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. క్వారంటైన్ సెంటర్‌లో ఉండాలంటేనే జంకుతున్నారు. వైరస్ రాకుండా చాలా మంది ఇండ్లకే పరిమితమయ్యారు. కానీ, కరోనాతో ఓ ప్రేమ జంట పెండ్లి చేసుకోబోతున్నారు. వింటానికి ఆశ్చర్యంగా ఉన్నా.. క్వారంటైన్ సెంటర్‌లో యువతి-యువకుడు ప్రేమలో పడ్డారు. ఆస్పత్రి కోలుకున్న వీళ్లు తల్లిదండ్రులకు పెండ్లి వార్త చెప్పి షాక్ ఇచ్చారు.
హైదరాబాద్‌లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్న వ్యక్తి తన స్వగ్రామమైన ప్రకాశం జిల్లా పర్చూరుకు వెళ్లాడు. అక్కడ అతడికి కరోనా సోకడంతో గుంటూరులోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేరాడు. దీంతో అతడిని వైద్యులు ఐసోలేషన్‌లో ఉంచారు. అలాగే, గుంటూరు జిల్లా చిలకలూరి పేటకు చెందిన ఓ యువతికి కూడా కరోనా సోకడంతో అదే ఆస్పత్రిలో చేరింది. అయితే, ఆ అబ్బాయిని అడ్మిట్ చేసిన వార్డులోనే అమ్మాయి కూడా అడ్మిట్ అయింది. పైగా ఇద్దరి బెడ్‌లు కూడా పక్క పక్కనే ఉండడంతో మాటలు కలుపుకున్నారు. తర్వాత ఇద్దరు క్వారంటైన్ ఉంటూ ప్రేమ స్టోరి నడిపించారు.
అనంతరం కరోనా నెగెటివ్‌గా రిపోర్టులు వచ్చాయి. తమ బిడ్డలు ఆస్పత్రి నుంచి కోలుకోవడంతో తల్లిదండ్రులు ఆనందంలో మునిగితేలారు. ఇదే సమయంలో తామిద్దరం ప్రేమించుకున్నామని.. పెండ్లి చేయాలంటూ ఇద్దరూ పెద్దలకు చెప్పారు. అబ్బాయికి మంచి ఉద్యోగం పైగా ఒకే సామాజిక వర్గం కావడంతో పెద్దలు పెండ్లికి ఒప్పుకున్నారు. దీంతో క్వారంటైన్ లవ్ స్టోరి మ్యారేజ్‌తో ముగిసింది.