- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అడ్డొచ్చిన కులం.. నవీన్, ఆయేషా ఆత్మహత్య
దిశ, ఏపీ బ్యూరో : ఆ ఇద్దరూ ప్రేమించుకున్నారు. జీవితాంతం కలిసిబతకాలనుకున్నారు. వివాహ బంధంతో తమ ప్రేమను పండించుకోవాలనుకున్నారు. తమ ప్రేమ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పారు. కులాలు వేరు కావడంతో ప్రేమ వివాహానికి ఒప్పుకునేది లేదని ఇరుకుటుంబాలు తేల్చి చెప్పాయి. దీంతో కలిసి జీవించలేనప్పుడు.. కలిసి చనిపోవడమే మంచిదని భావించిన ఆ ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాద ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల ప్రకారం.. ఆత్మకూరు టెక్కేవీధికి చెందిన సోమా నవీన్ (20), ఆయేషా (18) రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే కులాలు వేరు కావడంతో పెద్దలు వీరి పెళ్లికి అంగీకరించలేదు. ఎంత ప్రయత్నించినప్పటికీ పెద్దల మనసులు మారకపోవడంతో చనిపోవాలని నిర్ణయించుకున్నారు. పొలాల్లో విషగుళికలు తిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అపస్మారక స్థితిలో ఉన్న ప్రేమజంటను గమనించిన స్థానికులు వెంటనే ఆత్మకూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే వారు చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఆత్మకూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.