నష్టమెవరికి? లాభమెవరికి? భయపెడుతున్న హుజురాబాద్ పోలింగ్

by Sridhar Babu |   ( Updated:2021-10-30 05:19:11.0  )
Huzurabad polling
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: హుజురాబాద్ లో పోలింగ్ దూకుడుగా సాగుతోంది. ఉదయం నుండే ఓటర్లు ఉత్సాహంగా ఓట్లు వేసేందుకు ముందుకు వస్తున్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఉప ఎన్నికల్లో పోలింగ్ మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 86.18 శాతం ఓట్లు పోలు కాగా.. ఈ ఉప ఎన్నికల్లో మధ్యాహ్నం 3 గంటల వరకే 66.61 శాతం ఓట్లు పోల్ కావడం గమనార్హం. రాత్రి 7 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనున్న నేపథ్యంలో ఈ సారి 90 శాతం వరకు ఓట్లు పోలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అయితే పెరుగుతున్న ఓటింగ్ శాతం ఎవరికి లాభం జరుగుతుందోనన్న చర్చ రాజకీయ వర్గాల్లో ఊపందుకుంది. పెరుగుతున్న ఓట్లు ఎవరికి అనుకూలంగా పడతాయోనన్న ఆందోళన ఆయా పార్టీల్లో నెలకొంది. అదనంగా పెరుగుతున్న ఓటింగ్ శాతం వల్ల టీఆర్ఎస్, బీజేపీ పార్టీల్లో తీవ్ర చర్చ సాగుతోంది. గెలుపోటములను శాసించే విధంగా ఉంటాయన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed