లారీ బోల్తా… 14 మంది మృతి

by Sumithra |   ( Updated:2021-01-19 21:13:30.0  )
accident
X

దిశ,వెబ్‌డెస్క్: పశ్చిమ బెంగాల్‌లో మంగళవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జల్పాయ్‌గురి ప్రాంతంలో లారీ బోల్తాపడి 14 మంది మరణించారు. ఘటన వివరాల్లోకి వెళితే…. రాళ్ల లోడ్‌తో వెళుతున్న లారీ దూప్ గురిలోని జల్దాక బ్రిడ్జి వద్ద అదుపు తప్పింది. ఆ సమయంలో పక్కగా వెళుతున్న మూడు వాహనాలపై లారీ బోల్తాపడింది. దీంతో వాహనాల్లో ప్రయాణిస్తున్న వారిలో 14 మంది మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story