దేవుడితో సమానం హెల్త్ కేర్ వర్కర్లు :కేటీఆర్

by Shyam |   ( Updated:2021-06-03 07:52:24.0  )
ICU Buss
X

దిశ, తెలంగాణ బ్యూరో : మానవసేవే మాధవ సేవ అని.. దేవుడితో సమానంగా హెల్త్‌కేర్‌ వర్కర్లను ప్రజలు చూస్తున్నారని ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. లార్డ్స్ చర్చి మొదటి విడత అందజేసిన 30 మెడికల్ మొబైల్ బస్సులను గురువారం మంత్రి ట్యాంక్ బండ్ పై ప్రారంభించారు. అనంతరం బస్సులోని వైద్య సదుపాయాలను కేటీఆర్‌ పరిశీలించారు.

IT Minister KTR

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లో మొబైల్ ఐసీయూ బస్సుల ఏర్పాటుకు లార్డ్స్ చర్చి ముందుకు రావడం అభినందనీయమన్నారు. వెరాస్మార్ట్ హెల్త్ కేర్ సహకారంతో లార్డ్స్‌ చర్చి ఈ ప్రాజెక్టును ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. రెండో విడత మరో 32 బస్సులను ఏర్పాటు చేస్తామని చెప్పినందుకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఆ బస్సులు వస్తే జిల్లాకు రెండు బస్సులు కేటాయిస్తామని వెల్లడించారు.

mobile ICU buses

మెడికల్‌ యూనిట్‌ బస్సులో వైద్య సేవల కోసం ఒక డాక్టర్‌, ఇద్దరు నర్సులతో పాటు 10 ఆక్సిజన్ బెడ్లు అందుబాటులో ఉంటాయన్నారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టలేదని, పేదలకు తక్కువ ఖర్చుతో వైద్యసేవలు అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, ఎమ్మెల్యే ముఠా గోపాల్, గోవర్ధన్, ఎమ్మెల్సీ రాజేశ్వర్ రావు, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, కమిషనర్ అంజనీ కుమార్, లార్డ్ చర్జి ఫాస్టర్, సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Next Story