- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వింబుల్డన్ ఫైనల్‌కు బిగ్ మ్యాచ్ అడ్డంకి
దిశ, స్పోర్ట్స్: వింబుల్డన్ ఫైనల్ జరుగుతుందంటే లండన్‌లో ఒకటే సందడి నెలకొంటుంది. ప్రతీ ఏడాది జులై రెండో వారాంతంలో జరిగే వింబుల్డన్ ఫైనల్ కోసం ఎంతో మంది కొన్ని నెలల ముందే ప్రిపేర్ అవుతారు. మ్యాచ్ టికెట్లు కొనుక్కొని తమ అభిమాన ప్లేయర్ మ్యాచ్‌లు చూడటానికి వస్తుంటారు. గత ఏడాది వింబుల్డన్ కరోనా కారణంగా రద్దు కావడంతో.. ఈ సారి ప్రేక్షకుల తాకిడి మరింతగా ఉంటుందని అందరూ అనుకున్నారు.
కానీ లండన్ వింబ్లే స్టేడియంలో ఆదివారం రోజు ఇంగ్లాండ్-ఇటలీ జట్ల మధ్య యూరో కప్ 2020 ఫైనల్ జరుగనుండటంతో.. వింబుల్డన్ వెలవెల బోతున్నది. ఇప్పుడు లండన్‌లో ఎవరిని కదిలించినా యూరో కప్ ఫైనల్ గురించే మాట్లాడుకుంటున్నారు. 55 ఏళ్ల తర్వాత ఇంగ్లాండ్ జట్టు ఫైనల్ ఆడుతుండటంతో వింబుల్డన్ కంటే ఫుట్‌బాల్ మ్యాచ్ వైపే అందరూ దృష్టి సారించారు. దీంతో ఈ సారి సెంటర్ కోర్టు వద్ద సందడి కంటే వింబ్లే స్టేడియం వైపు వెళ్లడానికే లండన్ వాసులు మొగ్గు చూపుతున్నారు.