- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాజయ్యకు షాక్.. వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా మహిళా నేత!
దిశ, వెబ్‌డెస్క్: కీలక నేతలంతా వరుసగా పార్టీకి రాజీనామా చేస్తుండటంతో బీఆర్ఎస్ అధిష్టానం అప్రమత్తమైంది. కాంగ్రెస్‌తో టచ్‌లోకి వెళ్లిన నేతలపై ఫోకస్ పెంచింది. ఉన్న నేతలను కాపాడుకునే ప్రయత్నం చేయడంతో పాటు పార్టీని వీడిన నేతలకు షాక్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే వరంగల్ సీటు కోసం కొట్లాడి మరీ కూతురు కావ్యకు ఇప్పించుకున్న కడియం శ్రీహరి చివరి నిమిషంలో పార్టీకి హ్యాండ్ ఇవ్వడంతో అధిష్టానం సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో కడియం శ్రీహరికి తప్పకుండా బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ అధిష్టానం డిసైడ్ అయినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆమెకు పోటీ మహిళా నేతను దింపేందుకు ఆలోచిస్తున్నారు.
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి భార్య పెద్ది స్వప్న(ఎస్సీ మాల)ను బరిలోకి దింపాలని గులాబీ బాస్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. నల్లబెల్లి మండలం నుంచి జెడ్పీటీసీగా గెలిచిన స్వప్న ఫ్లోర్ లీడర్‌గా కొనసాగుతున్నారు. తెలంగాణ ఉద్యమంలోనూ కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలోనే ఆమెకు ఉద్యమకారులతో పాటు కేయూ జేఏసీ నేతలు కూడా సపోర్ట్ చేస్తారని కేసీఆర్ భావిస్తున్నారు. గతంలో స్వప్న ఎంపీ టికెట్ ఆశించారు.. అయితే పార్టీ కడియం కావ్యకు కేటాయించడంతో తప్పుకున్నారు. ఇప్పుడు కావ్య తప్పుకోవడంతో స్వప్నకు అవకాశం ఇవ్వాలని హైకమాండ్ భావిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. కాగా, వరంగల్ స్థానం నుంచి తాటికొండ రాజయ్య పేరు కూడా వినిపిస్తోంది.