MP ఎన్నికల వేళ మాదిగలకు మందకృష్ణ సంచలన పిలుపు

by GSrikanth |   ( Updated:2024-05-04 15:01:58.0  )
MP ఎన్నికల వేళ మాదిగలకు మందకృష్ణ సంచలన పిలుపు
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల వేళ మాదిగ సామాజికవర్గ ఓటర్లు, ప్రజలకు మందకృష్ణ మాదిగ సంచలన పిలుపు ఇచ్చారు. శనివారం మందకృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల్లో, కంటోన్మెంట్ ఉప ఎన్నికలో మాదిగలకు టికెట్ ఇచ్చేందుకు నిరాకరించిన కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. చిత్తు చిత్తుగా ఓడించాలని సూచించారు. దేశాన్ని 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ ఏనాడూ మాదిగల వర్గీకరణ ఆలోచించలేదని మండిపడ్డారు. ఎన్నికల సంఘం అనుమతితోనే కాంగ్రెస్ వ్యవహారశైలిపై మహాధర్నా చేయబోతున్నట్లు తెలిపారు. మాదిగలను ఘోరంగా అవమానించిన కాంగ్రెస్ నేతలు మాదిగలను ఓట్లు అడగొద్దని సూచించారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా మాట్లాడిన వివేక్ ఫ్యామిలీ టికెట్లు తెచ్చుకున్నారని గుర్తుచేశారు. రాజ్యాంగం కోసం కాంగ్రెస్ ధర్నా చేయడం లేదు. మాదిగల వల్ల నష్టం కాబట్టే ధర్నా చేస్తున్నట్లు ప్రకటించారు. రాజ్యాంగానికి మోడీ రక్షణ కవచం అని అన్నారు.

Read More..

టీ.కాంగ్రెస్‌లో తీవ్ర విషాదం.. MP అభ్యర్థి తల్లి కన్నుమూత

Advertisement

Next Story