ఎన్నికల సిత్రాలు: ఓటేసిన రజినీకాంత్, కమల్ హాసన్ ఇతర ప్రముఖులు.. అదిరిపోయే ఫొటో గ్యాలరీ కోసం క్లిక్ చేయండి..

by Dishanational5 |
ఎన్నికల సిత్రాలు: ఓటేసిన రజినీకాంత్, కమల్ హాసన్ ఇతర ప్రముఖులు.. అదిరిపోయే ఫొటో గ్యాలరీ కోసం క్లిక్ చేయండి..
X

దిశ, నేషనల్ బ్యూరో: సార్వత్రిక ఎన్నికల సమరంలో భాగంగా 21 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 లోక్‌సభ స్థానాల్లో శుక్రవారం తొలి విడత పోలింగ్‌ జరిగింది. సాయంత్రం 7 గంటల సమయానికి దాదాపు 60.03 శాతం పోలింగ్ నమోదైందని ఈసీ వెల్లడించింది. ఫామ్-17ఏలను స్క్రూటినీ చేశాక శనివారం ఉదయం కచ్చితమైన పోలింగ్ శాతాన్ని ప్రకటిస్తామని తెలిపింది. తొలి దశలో తమిళనాడు, అరుణాచల్ ప్రదేశ్, అసోం సహా 21 రాష్ట్రాల్లో పోలింగ్ జరగ్గా, తమిళనాడు సీఎం స్టాలిన్, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళి సైతోపాటు పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.



నాగాలాండ్‌లోని చెడెమా గ్రామంలోని పోలింగ్ స్టేషన్‌లో కెమెరాకు ఫోజు ఇస్తున్న వృద్ధ ఓటరును చూసి నవ్వుతున్న అంగామి నాగ తెగ ఓటర్లు



చెన్నయ్‌లో నటుడు, మక్కల్ నీధి మయమ్ అధ్యక్షుడు కమల్ హాసన్


థిలాస్‌పేట్‌లో ఓటేస్తున్న పుదుచ్చెరి సీఎం రంగసామి


తెలంగాణ మాజీ గవర్నర్, బీజేపీ సౌత్ చెన్నయ్ అభ్యర్థి తమిళిసై సౌందరరాజన్



చెన్నయ్‌లో ఓటు హక్కు వినియోగించుకుంటున్న సీఎం ఎం.కే స్టాలిన్


చెన్నయ్‌లోని మండవెలి బూత్‌లో ఓటు వేస్తున్న బీజేపీ నేత, నటి కుష్బూ సుందర్


చెన్నయ్‌లోని స్టెల్లా మారిస్ కాలేజ్‌లో ఓటు హక్కు వినియోగించుకుంటున్న రజినీకాంత్


అరుణాచల్ ప్రదేశ్‌లో ఓటేసేందుకు వస్తున్న వృద్ధురాలికి సాయం చేస్తున్న వ్యక్తి


తమకు తాగునీరు, రోడ్డు, స్కూల్ వంటి కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలంటూ డిమాండ్ చేస్తూ ఎన్నికలను బాయ్‌కాట్ చేసిన తమిళనాడులోని దిండిగల్ జిల్లా సీర్గంపట్టి గ్రామస్తులు


అండమన్ నికోబర్ దీవులలో ఓటేసిన అనంతరం ఫొటోకు ఫోజిస్తున్న షోంపెన్ తెగ ఓటరు



* note: Each Photo, which Published above are not our own. it belongs to respected their owners. we published here for information purpose only







Next Story

Most Viewed