- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మల్కాజ్‌గిరి బీఆర్ఎస్‌దే.. ఎవరొచ్చినా గెలుపు నాదే: లక్ష్మారెడ్డి
దిశ, వెబ్‌డెస్క్: మల్కాజ్‌గిరిలో గెలుపే లక్ష్యంగా మాజీ మంత్రి మల్లారెడ్డి నివాసంలో జరిగిన ఎమ్మెల్యేల సమావేశం ముగిసింది. ఈ సమావేశానికి హాజరైన పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ సదర్భంగా అభ్యర్థి గెలుపే లక్ష్యంగా కలిసికట్టుగా పనిచేయాలని నిర్ణయం తీసుకున్నారు. అనంతరం మల్కాజ్‌గిరి బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. మల్కాజ్‌గిరి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం కల్పించిన కేసీఆర్‌కు ధన్యవాదాలు చెప్పారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు.
హైదరాబాద్‌లో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసిన ఘనత కేటీఆర్‌దే అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయ్యాక ప్రజలకు కేసీఆర్ విలువ ఏంటో తెలిసి వచ్చిందన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు కచ్చితంగా నన్ను ఆశీర్వదిస్తారన్న నమ్మకం ఉందన్నారు. పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలు అందరూ నాకు అండగా ఉంటారని తెలిపారు. తాను ఎన్నో సేవ కార్యక్రమాలు చేశాను.. వేలాది మందికి ఆపరేషన్‌లు, ఉచితంగా విద్య అందించానని గుర్తుచేశారు. బీజేపీనే కాదు.. ఎవరొచ్చినా మల్కాజ్‌గిరిలో ఎగిరేది బీఆర్ఎస్ జెండానే అని ధీమా వ్యక్తం చేశారు.