- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఏపీలో ఎన్నికల వేళ హింసాత్మక ఘటనలు.. స్పంధించిన మాజీ సీఎం చంద్రబాబు.. ఏమన్నారంటే..?
దిశ వెబ్ డెస్క్: ఏపీలో ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రశాంతంగా సాగాల్సిన ఎన్నికలు హింసాత్మకంగా మారడంతో రాష్ట్రంలో పలుచోట్ల ఉద్రిక్తతల చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ అభ్యర్థి ఓటరుని కొట్టడం, అలానే కొన్ని చోట్ల వైసీపీ నేతలు రిగ్గింగ్‌కు యత్నించడం, వివాధాలకు తెరలేపేలా ప్రవర్తించడం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.
అయితే తాజాగా ఎన్నికల వేళ రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న హిసాత్మక ఘటనలపై మాజీ సీఎం చంద్రబాబు ట్విట్టర్ వేధికగా స్పంధించారు. నేటి పోలింగ్‌లో వైసీపీ హింస ఎంతవరకు వెళ్లిందంటే.. కనీసం పోలీసులకు కూడా రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తాడిపత్రిలో ఏకంగా ఎస్పీ వాహనం పైనే దాడి చేయడం, తాడిపత్రి టీడీపీ అభ్యర్థి అస్మిత్ రెడ్డి పై దాడికి దిగడం వైసీపీ హింసా రాజకీయాలకు పరాకాష్ట అని మండిపడ్డారు.
జగన్ 5ఏళ్లుగా పెంచి పోషించిన రౌడీ మూకలు.. ఈరోజు తమ దాడుల ద్వారా ప్రజల్లో భయం పుట్టించి పోలింగ్ శాతాన్ని తగ్గించడం ద్వారా లబ్ధి పొందే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఈ కుట్రను మీరే తిప్పికొట్టాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు అందరూ నిర్భయంగా తరలివచ్చి ఓటు వేయాలి అని ప్రజలకు పిలుపునిచ్చారు. అత్యధిక ఓటు శాతంతో వైసీపీ హింసా రాజకీయానికి ముగింపు పలకాలని పేర్కన్నారు.