కాంగ్రెస్ గెలిస్తే షరియా చట్టం తెస్తారు: యూపీ సీఎం Yogi Adityanath

by Swamyn |   ( Updated:2024-04-23 14:27:12.0  )
కాంగ్రెస్ గెలిస్తే షరియా చట్టం తెస్తారు: యూపీ సీఎం Yogi Adityanath
X

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ పార్టీపై యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ మంగళవారం తీవ్రమైన ఆరోపణలు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ‘షరియా చట్టం’ తీసుకొస్తుందని, ఆ పార్టీ మేనిఫెస్టోను పరిశీలిస్తే అది అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని అమ్రోహాలో నిర్వహించిన ర్యాలీలో యోగీ ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘‘దేశానికి ద్రోహం చేసిన కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు మరోసారి తప్పుడు మేనిఫెస్టోతో మీ ముందుకు వచ్చాయి. కాంగ్రెస్ మేనిఫెస్టోను పరిశీలిస్తే, ఆ పార్టీ గెలిస్తే దేశంలో షరియా చట్టాన్ని అమలు చేస్తామని చెప్పుకుంటున్నట్టు ఉంది. వారు గెలిస్తే, వ్యక్తిగత చట్టాలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రధాని మోడీ త్రిపుల్ తలాక్‌ను రద్దు చేయడంతో మరోసారి ‘పర్సనల్ లా’ను తీసుకొచ్చి షరియా చట్టాన్ని అమలు చేస్తామని అంటున్నారు. ఇప్పుడు చెప్పండి.. ఈ దేశం అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం నడవాలా? లేక షరియత్ ప్రకారమా? మీరే నిర్ణయించుకోండి’’ అంటూ ఓటర్లను ఉద్దేశించి మాట్లాడారు. అలాగే, ప్రజల ఆస్తులను లాక్కుని, పంచుతామని మేనిఫెస్టోలో చెప్పారని తెలిపిన యోగి.. మీ ఆస్తులను దోచుకోవడానికి కాంగ్రెస్, ఎస్పీలకు అవకాశం ఇస్తారా? అంటూ జనాలను ప్రశ్నించారు.

Advertisement

Next Story

Most Viewed