BRS పార్లమెంట్ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ విడుదల

by GSrikanth |   ( Updated:2024-03-04 11:31:31.0  )
BRS పార్లమెంట్ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల తొలి జాబితాను బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ప్రకటించారు. సోమవారం తెలంగాణ భవన్ వేదికగా పలు సెగ్మెంట్ల నేతలతో భేటీ అయిన కేసీఆర్.. ఎన్నికల్లో అనుసరించే వ్యూహాలను దిశానిర్ధేశం చేశారు. అనంతరం నాలుగు లోక్‌సభ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఆయా సెగ్మెంట్ల నేతలతో సుదీర్ఘంగా చర్చించి పేర్లు ప్రకటించారు.

ఖమ్మం అభ్యర్థిగా నామా నాగేశ్వర రావు, మహబూబాబాద్ అభ్యర్థిగా మాలోతు కవిత, పెద్దపల్లి అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్, కరీంనగర్ అభ్యర్థిగా బోయినపల్లి వినోద్ కుమార్‌లను ప్రకటించారు. దీంతో బీఆర్ఎస్ నేతల్లో ఉత్సాహం మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం కాస్త సైలెంట్‌గా ఉన్న గులాబీ శ్రేణులు అభ్యర్థుల ప్రకటనతో ఒక్కసారిగా జోష్ పెంచారు. మరి లోక్‌సభ ఎన్నికల్లో అయినా సత్తా చాటుతారో లేదో చూడాలి.

Advertisement

Next Story