- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్ మూడో జాబితా విడుదల.. తెలంగాణలో 5 స్థానాలకు అభ్యర్థులు ఖరారు
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థుల మూడో జాబితా విడుదలైంది. గురువారం రాత్రి హైకమాండ్ అధికారికంగా 57 మందితో జాబితా రిలీజ్ చేసింది. ఇందులో తెలంగాణలోని ఐదు పార్లమెంట్ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. పెద్దపల్లి = వంశీకృష్ణ, మల్కాజిగిరి = సునీతా మహేందర్ రెడ్డి, సికింద్రాబాద్ = దానం నాగేందర్, చేవెళ్ల = రంజిత్ రెడ్డి, నాగర్ కర్నూలు = మల్లు రవిని ఖరారు చేశారు.
కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్.. పార్లమెంట్ ఎన్నికల్లోనూ అదే ఊపు కొనసాగించాలని వ్యూహ రచన చేస్తోంది. 17 అసెంబ్లీ స్థానాల్లో కనీసం 10 నుంచి 15 స్థానాల్లో పాగా వేయాలని విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం గెలుపు గుర్రాలనే బరిలోకి దింపుతోంది. ఇప్పటికే దాదాపు 10కి పైగా స్థానాలకు అభ్యర్థులను అధిష్టానం ప్రకటించింది. అనూహ్యంగా ఈ జాబితాలో ముగ్గురు ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన వారే ఉండటం ఆసక్తిగా మారింది. చేవెళ్ల టికెట్ రంజిత్ రెడ్డికి, మల్కాజిగిరి టికెట్ సునీతా మహేందర్ రెడ్డి, సికింద్రాబాద్ టికెట్ దానం నాగేందర్‌కు కేటాయించడం చర్చనీయాంశంగా మారింది.