- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఒమిక్రాన్ ఎఫెక్ట్ : తెలంగాణలో అక్కడ లాక్‌డౌన్
దిశ, వెబ్‌డెస్క్ : దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్ నిర్ధారణ కావడంతో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గూడెం గ్రామంలో లాక్ డౌన్ విధించారు.
వివరాల్లోకి వెళ్లితే.. 26 ఏళ్ల యువకుడు దుబాయ్ నుంచి తన సొంత గ్రామమైన గూడెం గ్రామానికి వచ్చారు. అతనికి హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో టెస్టులు చేయగా నెగిటివ్ వచ్చింది. ఇక కరోనా ఎటాక్ చేయలేదని సంతోషంగా కుటుంబంతో గడుపుతున్న ఆయనకు రెండు మూడు రోజుల తర్వాత జలుబు, జ్వరం వంటి లక్షణాలు కనిపించాయి. దీంతో అతను టెస్ట్ చేయించుకోగా కరోనా పాజిటివ్‌గా తేలింది. జీనోమ్ సీక్వెన్సింగ్‌లో ఒమిక్రాన్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఒమిక్రాన్ పాజిటివ్ నిర్ధారణ కావడంతో జిల్లా యంత్రాంగం, ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. అతనితో సన్నిహితంగా ఉన్నవారందరికీ టెస్ట్‌లు చేయగా యువకుడి తల్లీ, భార్యకు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆ గ్రామంలోని పంచాయతీ పెద్దలు చర్చించి గ్రామంలో పది రోజుల పాటు లాక్ డౌన్ విధించారు. ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావద్దని ఆంక్షలు విధించారు.