- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'లాక్ డౌన్ ఉల్లంఘిస్తే కాల్చి పారేయండి'
మనీలా : ప్రభుత్వ ఆదేశాలను లెక్క చేయని వారిని కాల్చేయమనడం ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రొడ్రిగో డ్యుటెర్టెకు కొత్తేమీ కాదు. తాజాగా, కరోనా కట్టడి చర్యలను ఉల్లంఘించిన వారిని కాల్చిపారేస్తాం అని ఆయన హెచ్చరించారు. ఫిలిప్పీన్స్ లో కరోనా వ్యాప్తి వేగం అందుకుంటున్నది. దాన్ని నియంత్రించేందుకు లుజోన్ ద్వీపం సహా మరికొన్ని ప్రాంతాల్లో నెల రోజులపాటు సర్కారు లాక్ డౌన్ విధించింది. ఈ లాక్ డౌన్ ఉల్లంఘించినవారిని షూట్ చేస్తామని బుధవారం హెచ్చరికలు జారీ చేశారు.
బుధవారం రాత్రి ఫిలిప్పీన్స్ పౌరులను ఉద్దేశిస్తూ అధ్యక్షుడు రొడ్రిగో డ్యుటెర్టె మాట్లాడారు. ‘ప్రభుత్వాన్ని బెదిరించొద్దు. సవాల్ చేయొద్దు. మీరే ఓడిపోతారు. ఇదో హెచ్చరిక. గుర్తుపెట్టుకోండి. ఇలాంటి కష్టకాలంలో ప్రభుత్వ ఆదేశాలను పాటించండి. హెల్త్ వర్కర్లు, డాక్టర్లకు హాని చేయొద్దు. అది పెద్ద నేరం. లాక్ డౌన్ కాలంలో ఎటువంటి సమస్యను సృష్టించినా… వారి ప్రాణాలు ప్రమాదంలో పడినట్టే. ఉల్లంఘనులను కాల్చివేయాల్సిందిగా పోలీసులు, మిలిటరీకి ఆదేశిస్తు’న్నట్టు తెలిపారు.
మనీలాకు సమీపంలోని ఓ నగరంలో హైవే పొడుగునా కొందరు ధర్నాకు దిగిన నేపథ్యంలో అధ్యక్షుడు డ్యుటెర్టె ఈ హెచ్చరికలు జారీ చేశారు. రెండు వారాల నుంచి లాక్ డౌన్ అమలు అవుతున్నది కానీ అప్పటి నుంచి తమకు సర్కారు ఆహారం,నగదు పంపిణీ చేయలేదని ఆందోళనకారులు నిరసన తెలిపారు. కడుపుకాలితేనే రోడ్డెక్కామని కెజాన్ సిటీలోని మురికి వాడల ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఆ ఆందోళకారులపైనా ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. అనంతరం తాజాగా, హెచ్చరికలు జారీ చేశారు. ఫిలిప్పీన్స్ లో 2, 311 మందికి కరోనా సోకగా 19 మంది మరణించారు.
Tags: Philippines, president, shoot, dead, lockdown