నిజామాబాద్ డిప్యూటీ మేయర్‌పై లాక్‌డౌన్ ఉల్లంఘన కేసు

by vinod kumar |

దిశ, నిజామాబాద్: లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించినందుకు నిజామాబాద్ నగర డిప్యూటీ మేయర్ మహమ్మద్ ఇద్రిస్ ఖాన్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ గౌరేందర్ గౌడ్ బుధవారం వెల్లడించారు. 14వ డివిజన్‌లో కరోనా వ్యాప్తి నియంత్రణకు ఆరోగ్య కార్యకర్తలు సర్వే, శాంపిళ్ల సేకరణకు వెళ్లారు. వారిని డిప్యూటీ మేయర్ ఇద్రిస్ ఖాన్, ఎజాజ్ హుస్సేన్, షాబాజ్‌లు అడ్డుకున్నారు. ఆరోగ్య కార్యకర్తల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐతో వారు వాగ్వాదానికి దిగారు. ఈ మేరకు డిప్యూటీ మేయర్, అతని అనుచరులపై కేసులు నమోదు చేసినట్టు ఎస్ఐ గౌరేందర్ గౌడ్ తెలిపారు.

Tags : carona, lockdown, deputy mayor, file rules break case

Advertisement

Next Story