రూల్స్ బ్రేక్..ఫంక్షన్ హాల్‌పై కేసు

by Sridhar Babu |

దిశ, న‌ల్ల‌గొండ: తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది.దానికి సంబంధించిన రూల్స్‌ను బయటకు వెల్లడించి, ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అయినా కూడా కొందరు వినకుండా యథేచ్చగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఫంక్ష‌న్ హాల్స్ బంద్ చేయాల‌ని నోటీసులు ఇచ్చారు. అయినా వినకుండా నిబంధ‌న‌లు బ్రేక్ చేసిన సూర్య‌ాపేట‌లోని జీవీవీ ఫంక్ష‌న్ హాల్ యాజ‌మాన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు.ఈ విషయాన్ని సూర్యాపేట మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ పి.రామంజుల రెడ్డి స్వయంగా వెల్లడించారు. ఈ ఫంక్ష‌న్ హాల్‌లో జ‌రిగిన శుభ కార్యానికి క‌రోనా ల‌క్ష‌ణాలు ఉన్న వ్యక్తులు హాజ‌రై పట్ట‌ణంలో తిరుగుతున్నట్టు ప్ర‌చారం జ‌రుగుతోంద‌న్నారు. ఒకే చోట పెద్ద ఎత్తున ప్రజలు గుమికూడకుండా చూడాలని పుర‌పాల‌క సంఘం నోటీసులు కూడా పంపించింది. అది కూడా ప‌ట్టించుకోకుండా, నిర్ల‌క్ష్యం వహించిన ఫంక్ష‌న్ హాల్ య‌జ‌మాన్యంపై సూర్య‌ాపేట టు-2టౌన్ పీఎస్‌లో ఫిర్యాదు చేయ‌గా, వారు క్రైమ్ నెంబ‌ర్ 106/2020 u.s 188, 269, 270-IPC, 3-EDA ప్ర‌కారం కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్టు క‌మిష‌న‌ర్ తెలిపారు.

Tags: corona, lockdown, function hall, case file, nalgonda

Advertisement

Next Story

Most Viewed