- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అన్న మనోడే వదిలేయ్.. వారికి లాక్ డౌన్ వర్తించదట
దిశ, ఆదిలాబాద్: అన్నా..పోలీసులు బండి పట్టీడ్లు ఎక్కడ తమ్మి చౌక్ లో సరే అక్కడే ఉండు నేను మాట్లాడతా హలో సార్ మనోడి బండి పట్టుకున్నారంటా సరే సార్..వదిలేస్తున్నాం. ఇలా రాజకీయ నాయకులకు తెలిసినవారికి లాక్ డౌన్ మినహాయింపు..ఇక ఎవరూ పరిచయం లేనివారు అత్యవసర పరిస్థితుల్లో బయటకు వస్తే ఎక్కడికి వెళ్తున్నావ్, ఏ పని మీద బయటకు వచ్చావని అడగకుండానే పోలీసులు తమ సెల్ ఫోన్ లో ఫోటోలు తీస్తున్నారు. సార్ మా బంధువులు ఆసుపత్రిలో ఉన్నారు..వారికి టిఫిన్ తీసుకు వెళ్తున్నాను సార్ అని ఎంత వేడుకున్నా వినకుండా చలానా ద్వారా ఫైన్లు వేస్తూ కేసులు నమోదు చేస్తున్నారు. అలాగే వాహనాలను సైతం సీజ్ చేస్తున్నారు. ఇలా జిల్లాలో ఖాకీల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సామాన్యులకే ఆంక్షలు కఠినతరం…
లాక్ డౌన్ విధించిన రెండు మూడు రోజులు మినహాయింపు సమయము దాటినా కూడా ప్రజలు రోడ్లపైకి వచ్చినా పోలీసులు పట్టించుకోలేదు. సాధారణ పరిస్థితి లాగానే కనిపించింది. అయితే (పోలీస్ బాస్) రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి లాక్ డాన్ ఆంక్షలను కటీనతరం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఏ కారణం లేకుండా రోడ్లపైకి వస్తే కేసులు నమోదు చేసి వాహనాలు సీజ్ చేయాలని సూచించారు. కానీ జిల్లాలో మాత్రం పోలీసులు లాక్ డౌన్ సమయంలో తెలిసినవారు..పొలిటికల్ లీడర్స్ రోడ్లపైకి వస్తే వారిని వదిలేస్తూ మినహాయింపు ఇస్తున్నారు. సామాన్య ప్రజలకు మాత్రం ఆంక్షలను కఠినతరం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా పదకొండవ రోజు శనివారం వరకు 2500 మందిపై కేసులు, 555 ద్విచక్ర వాహనాలు, 20కి పైగా కార్లను సీజ్ చేశారు. ఈసీ జైన వాహనాల్లో ఏ ఒక్కటి కూడా రాజకీయ నాయకులవి లేవు. అన్ని సామాన్య ప్రజలవే ఉండటం విమర్శలకు తావిస్తోంది.
అత్యవసరంగా బయటకు వస్తే అమాయకులపై కేసులు..
కరోనా కట్టడి లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. నిత్యావసర సరుకుల కొనుగోలు, ఇతర పనుల నిమిత్తం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మినహాయింపు ఇచ్చారు. ఈ నాలుగు గంటల సమయం ప్రజలకు సరిపోవడం లేదు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో అత్యవసర పనుల నిమిత్తం లాక్‌డౌన్ సమయంలో ప్రజలు బయటకు వస్తున్నారు. దీంతో పోలీసులు పొలిటికల్కు టచ్ లేకుండా, పోలీసులు పరిచయము లేని వారి ఫోటోలను చిత్రీకరిస్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నావ్ …ఏ పని పై బయటకు వచ్చావని అడగకుండానే పోలీసులు ఫోటోలు తీస్తూ వెంటనే చలానా ద్వారా ఫైన్లు వేస్తూ కేసులు నమోదు చేస్తున్నారు. పొలిటికల్ లీడర్స్ చిన్నాచితక కార్యకర్తల వాహనాలను పట్టుకుంటే కాల్ వస్తే వెంటనే వదిలేస్తున్నారు.