- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఐపీఎల్ మరోసారి వాయిదా
by Shyam |

X
క్రికెట్ అభిమానులకు ఇది షాక్‌లాంటి వార్త. ఐపీఎల్ నిరవధికి వాయిదా పడనుంది. తాజాగా కేంద్రం లాక్‌డౌన్‌ను ఏప్రిల్ 30 వరకు పొడిగించేందుకే మొగ్గు చూపుతుండటంతో, ఐపీఎల్‌ను మరోసారి వాయిదా వేయడంపై అధికారిక ప్రకటన మాత్రమే వెలువడాల్సి ఉందని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు. పంజాబ్, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలు ఇప్పటికే లాక్ డౌన్‌ను ఏప్రిల్ 30 వరకు పొడిగించాయి. దీంతో ఐపీఎల్ జరిగే అవకాశం ప్రస్తుతానికి లేదు.
వీలు కుదిరితే షెడ్యూల్‌ను కుదించి, అక్టోబర్, నవంబర్‌లో నిర్వహించే అవకాశాలను పరిశీలిస్తామని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. కాగా, ఇప్పటికే ఐపీఎల్ ను ఏప్రిల్ 15 వరకూ వాయిదా వేస్తున్నట్టు గవర్నింగ్ బాడీ వెల్లడించిన సంగతి తెలిసిందే.
Tags: Lockdown IPL, Postponed, cricket, sports news
Next Story