14 రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌.. ఏయే రాష్ట్రాల్లో అంటే?

by Shamantha N |   ( Updated:2021-05-08 05:59:16.0  )
14 రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌.. ఏయే రాష్ట్రాల్లో  అంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా తీవ్రరూపం దాల్చుతుండటంతో పలు రాష్ట్రాలు లాక్‌డౌన్ విధిస్తున్నాయి. దేశంలో ఇప్పటివరకు 14 రాష్ట్రాలు సంపూర్ణ లాక్‌డౌన్ విధించగా.. మరికొన్ని రాష్ట్రాలు పాక్షిక లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూ లాంటివి అమలు చేస్తున్నాయి. ఇప్పటివరకు ఏ ఏ రాష్ట్రాలు లాక్ డౌన్ విధించాయో చూద్దాం.

తొలుత మహారాష్ట్ర లాక్ డౌన్ విధించింది. మే 15వరకు మహారాష్ట్రలో లాక్ డౌన్ అమల్లో ఉంది. ఇక ఢిల్లీలో మే 10వరకు లాక్ డౌన్ అమల్లో ఉండగా.. దానికి మళ్లీ పొడిగించే అవకాశముంది. ఇక కేరళలో మే16వరకు సంపూర్ణ లాక్ డౌన్ అమల్లో ఉంది. మధ్యప్రదేశ్ లో మే 15 వరకు, యూపీలో మే 10వరకు, హిమాచల్ ప్రదేశ్ లో మే 16వరకు, తమిళనాడులో మే 24వరకు, కర్ణాటకలో మే 24 వరకు, రాజస్థాన్ లో మే 24 వరకు, బిహార్లో మే 15 వరకు, చండీగఢ్‌లో వారం రోజులు, గోవాలో మే 23వరకు, హర్యానాలో మే 10 వరకు, మణిపూర్‌లో మే 7వరకు లాక్ డౌన్ అమల్లో ఉండనుంది.

Advertisement

Next Story

Most Viewed