అక్కడ జులై 31దాకా లాక్‌డౌన్

by Shamantha N |
అక్కడ జులై 31దాకా లాక్‌డౌన్
X

ముంబయి: మహారాష్ట్రలో కరోనా కేసులు స్థిరంగా పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను వచ్చే నెల 31 దాకా పొడిగించింది. ఈ నిర్ణయాన్ని ప్రకటించి ‘మిషన్ మళ్లీ మొదలైంది’ అనే పేరిట కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. అత్యవసరాలు మినహా దేనికోసమూ ప్రజలు బయటకు వెళ్లొద్దని, బయట అడుగుపెట్టినా పరిమిత దూరానికే కుదించుకోవాలని తెలిపింది. అప్పుడు కూడా సామాజిక దూరం, మాస్కుల ధారణ, వ్యక్తిగత శుభ్రతలాంటి ముందుజాగ్రత్తలు తప్పకుండా పాటించాలని ఆదేశించింది. అయితే, పనిప్రాంతాలకు, ఆఫీసులకు వెళ్లేవారిని, అత్యవసర సేవలందించేవారికి మాత్రం బయట తిరిగే అవకాశముంటుందని ప్రకటనలో పేర్కొంది. కరోనా మహమ్మారి విలయం ఇంకా ముగిసిపోలేదని, దానిపై విజయవంతంగా పోరాడుతున్నా ప్రజలూ జాగ్రత్తగా వ్యవహరించాలని, మళ్లీ లాక్‌డౌన్ విధించకుండా నడుచుకోవాలని ఆదివారం సీఎం ఉద్ధవ్ ఠాక్రే సూచించిన సంగతి తెలిసిందే. ఈ సూచనలు చేసిన తర్వాతి రోజే లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.

Advertisement

Next Story

Most Viewed