పనులు చేస్తాం.. తొలగింపు మరుస్తాం.. వారి నిర్లక్ష్యానికి స్థానికులు ఫైర్

by Shyam |   ( Updated:2021-11-04 06:08:52.0  )
పనులు చేస్తాం.. తొలగింపు మరుస్తాం.. వారి నిర్లక్ష్యానికి స్థానికులు ఫైర్
X

దిశ, వనస్థలిపురం: వనస్థలిపురం రైతు బజార్ నుండి బీఎన్ రెడ్డి వెళ్లే దారిలో గౌతమి నగర్ రోడ్ నంబర్-3 వద్ద కొన్ని రోజుల క్రితం డ్రైనేజి పైపులైనుకు మరమ్మతులు చేపట్టారు. అనంతరం అక్కడి నుంచి తవ్విన మట్టి, ఇటుకలు, పనులు చేసే సమయంలో అడ్డుగాపెట్టే ‘కాశన్ బోర్డు’, ఇనుప గేట్లు తొలగించడం మరిచారు. ఆ చోట ఉన్న మట్టి, దుమ్ము, ధూళితో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. దాని నుంచి వచ్చే దుమ్ము‌తో వాహనదారులు అసౌకర్యానికి గురవుతున్నారు. మట్టి వల్ల వాహనదారులు కింద జారిపడి గాయాలపాలవుతున్నారు.

Advertisement

Next Story