అందరికీ వ్యాక్సిన్ ఫ్రీగా ఇవ్వండి : దీదీ

by Shamantha N |   ( Updated:2021-05-05 06:10:41.0  )
అందరికీ వ్యాక్సిన్ ఫ్రీగా ఇవ్వండి : దీదీ
X

కోల్‌కతా : పశ్చిమబెంగాల్‌లో కరోనా కేసుల పెరుగుదలతో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కొవిడ్ కట్టడి చర్యలకు పూనుకున్నారు. రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ లభ్యత అవసరానికి సరిపడా లేదని, వాటిని తగినంత అందించాలని మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కేంద్రం ప్రకటించిన మే 1 నుంచి 18 ఏళ్ల పైబడినవారికి వ్యాక్సిన్ కార్యక్రమం ఇంకా వాస్తవరూపం దాల్చలేదని ఆమె విమర్శించారు. సమయానుకూలంగా అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందించాలని ఆమె కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో పేర్కొన్నారు.

Advertisement

Next Story