మరో రెండు రోజులు ఇలాగే

by Shyam |   ( Updated:2020-08-14 22:07:52.0  )
మరో రెండు రోజులు ఇలాగే
X

దిశ, వెబ్ డెస్క్: గత రెండు రోజుల నుంచి రాష్ట్రంలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా వాతావరణ కేంద్రం ఓ ప్రకటన చేసింది. మరో రెండు రోజులు ఇలాగే రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది. ఒడిశాలోని ఉత్తరకోస్తా, దానిని ఆనుకుని పశ్చిమ బెంగాల్ లోని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతుందని, మరో వైపు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో ఇవాళ, రేపు ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయని పేర్కొన్నది.

Advertisement

Next Story