- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బిగ్ బ్రేకింగ్ : ఫిజికల్ తరగతులకు ప్రభుత్వం ఒకే.. కానీ!
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలను సెప్టెంబరు 1వ తేదీ నుంచి ప్రారంభించవచ్చని విద్యాశాఖ భావిస్తున్నది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న విద్యాశాఖ అధికారులు వివిధ కోణాల్లో ఆలోచించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకోవడమే తరువాయి. ఎలాగూ ఇంకా రెండు వారాలకు పైగా టైమ్ ఉన్నందున ఏ తరగతి స్థాయిలో ఎలాంటి నిర్దిష్టమైన మార్గదర్శకాలను రూపొందించవచ్చు అనేది ఖరారు కానున్నది. విద్యాశాఖ పంపిన ప్రతిపాదనలను దృష్టిలో పెట్టుకుని వైద్యారోగ్య శాఖ అభిప్రాయాన్ని కూడా తీసుకున్న తర్వాత ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్‌లో వివిధ శాఖల ఉన్నతాధికారులతో లోతుగా సమీక్షించి అక్కడ వెలువడే అభిప్రాయాలకు అనుగుణంగా సమిష్టి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
చాలా రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో విద్యా సంస్థలు క్రమంగా ఓపెన్ అవుతూ ఉన్నాయి. ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కర్నాటక, పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో పాఠశాలలను తెరవడానికి ప్రభుత్వాలు ఇప్పటికే నిర్ణయాలు తీసుకున్నాయి. ఆ రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో కరోనా పరిస్థితి మరింత మెరుగ్గా ఉన్నందున సెప్టెంబరు 1వ తేదీ నుంచి ప్రారంభించవచ్చని విద్యాశాఖ భావించింది. అయితే, ఏయే తరగతుల విద్యార్థులకు ఎలాంటి తీరులో ఫిజికల్ క్లాసుల్ని నిర్వహించవచ్చు, వైరస్ వ్యాప్తి కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు, పాఠాలు బోధించే ఉపాధ్యాయులందరికీ వ్యాక్సిన్ తీసుకోవాలన్న నిబంధనపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, హాస్టళ్ళను తెరవడంలో ఉన్న ఇబ్బందులు.. ఇలా అనేక అంశాలపై సమీక్ష జరిగిన తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
గతేడాది మార్చి నుంచి విద్యాసంస్థలన్నీ మూసివేసే ఉండటంతో పిల్లల్లో స్కూలు వాతావరణమే లేకుండా పోయిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆన్‌లైన్ పాఠాలతో ఉపాధ్యాయులకు, పిల్లలకు మధ్య ఉండే సహజమైన బంధం ఉనికిలో లేకుండా పోయిందని, పిల్లల్లో లాజికల్ థింకింగ్ మసకబారిందని, ఇప్పటికైనా స్కూళ్ళను తెరవడం అవసరమని ఉపాధ్యాయులు భావిస్తున్నారు.
అయితే, 8వ తరగతి నుంచి పీజీ విద్యార్థులకు మాత్రమే ప్రత్యక్ష తరగతులు నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. మిగతా వారికి ఆన్‌లైన్ ద్వారానే తరగతులు నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. కాగా, దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ రోజు సాయంత్రం విద్యాశాఖ ప్రకటించనున్నట్టు సమాచారం.