- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Michael K Williams:డ్రగ్స్ మధ్యలో స్టార్ హీరో మృతదేహం.. అసలు ఏం జరిగింది..?
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం చిత్రపరిశ్రమను డ్రగ్స్ పట్టి పీడిస్తుంది. డ్రగ్స్ మత్తులో పడి ఎంతోమంది సెలబ్రిటీస్ తమ ప్రాణాలను కోల్పోయారు. ఇంకొంతమంది ఈ డ్రగ్స్ మాయలో పడి కెరీర్ ని నాశనం చేసుకున్నారు. తాజాగా అమెరికా ప్రముఖ టెలివిజన్ షో ‘ది వైర్’ సిరీస్ నటుడు మైఖేల్ కె విలియమ్స్(54) డ్రగ్స్ కు బానిసై కన్నుమూశాడు. సోమవారం మధ్యాహ్నం డ్రగ్స్ మధ్యలో శవంలా కనిపించాడు. తన అపార్ట్‌మెంట్‌లో అమెరికా కాలమానం ప్రకారం మధ్యాహ్నం రెండు గంటలకు మైఖేల్ చనిపోయి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అమెరికా కేబుల్ నెట్‌వర్క్ అయిన హెచ్‌బీఓలో ‘ది వైర్’ టెలివిజన్ సిరీస్ ద్వారా పాపులర్ అయిన మైఖేల్ కె విలియమ్స్.. ఐదుసార్లు ప్రైమ్‌టైం ఎమ్మీ అవార్డుకు నామినేట్ అయ్యారు. 2021లోనూ ‘లవ్‌క్రాఫ్ట్ కంట్రీ’ సిరీస్‌లో విలియమ్స్ ఉత్తమ నటనతో 2021 ఎమ్మీ అవార్డుకు కూడా నామినేట్ అయ్యారు.
అమెరికాలో నివసిస్తున్న మైఖేల్ గత రెండు రోజుల నుంచి ఫోన్ తీయకపోవడంతో దూరపు బంధువు అయిన ఒక వ్యక్తి ఆయన ఇంటికి వెళ్లి చూడగా డ్రగ్స్ ప్యాకెట్ల మధ్యలో ఆయన మృతదేహం కనిపించినట్లు పోలీసులు తెలిపారు. డ్రగ్స్ ఓవర్ డోస్ వల్లే మైఖేల్ చనిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. 54 సంవత్సరాల మైఖేల్.. భార్య చనిపోయాక డ్రగ్స్ కి బానిస అయ్యాడు. ఈ క్రమంలోనే ఆయన ఒంటరిగా ఉంటున్నాడు. ఈ అలవాటు నుంచి బయటపడాలని ప్రయత్నిస్తున్నా.. తన వల్ల కావడం లేదంటూ ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. ఒమర్ లిటిల్ క్యారెక్టర్‌తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న మైఖేల్ ఇలా డ్రగ్స్ కి బానిసై మృతిచెందడం బాధిస్తున్న విషయమని ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.