గంటలో 172 వంటకాలు.. తొమ్మిదేళ్ల చిన్నోడి రికార్డ్

by Sujitha Rachapalli |
గంటలో 172 వంటకాలు.. తొమ్మిదేళ్ల చిన్నోడి రికార్డ్
X

దిశ, ఫీచర్స్ : వంటగదిలో బ్యాచిలర్ పడే పాట్ల గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇక మహిళామణులైతే వంటగదిలో పెద్ద యుద్ధమే చేస్తారు. అయితే కూర ఎవరు చేసినా, తక్కువలో తక్కువ ఓ పది నిమిషాల టైమ్ అయినా పడుతుంది. కానీ ఓ తొమ్మిదేళ్ల చిన్నోడు మాత్రం క్షణాల్లో వంటలు చేస్తూ రికార్డులు సృష్టిస్తున్నాడు. చెన్నైకి చెందిన హయాన్ అబ్దుల్లాకు చిన్నప్పటి నుంచే కుకింగ్ అంటే ఇష్టం. ఈ క్రమంలో చిన్నవయసులోనే ‘పాస్తా బార్’ ఏర్పాటు చేసి, ప్రతి ఒక్కరూ పాస్తాతో ప్రేమలో పడాలని కలలు కన్నాడు.

మూడో తరగతి నుంచే హయాన్ వంట గదిలో అమ్మతో కలిసి వంటలు చేయడం మొదలుపెట్టాడు. అప్పటి నుంచి రకరకాల వంటకాలు, జ్యూస్‌లు తయారు చేస్తూ అందరి మెప్పు పొందుతూ వచ్చిన హయాన్.. గంటలోనే 172 వంటకాలు తయారుచేసి ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో స్థానం పొందాడు. అతను తయారుచేసిన ఆహార పదార్థాల్లో వివిధ రకాల సలాడ్లు, దోసెలు, మంచీస్, స్నాక్స్ ఉన్నాయి. ‘నేను సాసేజ్‌ను ఉడకబెట్టి మయోన్నైస్ మరియు సాస్‌తో వడ్డించాను. ఇట్స్ యమ్మీ. ఇది నా ఫేవరెట్’ అని హయాన్ అన్నారు. హయాన్ తన పాకశాస్ర్త ప్రతిభను చాటుకోవడానికి ‘హయన్ డెలికాసీ’ అనే యూట్యూబ్ ఛానెల్ కూడా రన్ చేస్తున్నాడు. ఈ వీడియోలను ఇంగ్లిష్, మలయాళం, తమిళంలో పోస్ట్ చేస్తుండగా, టీవీలో వచ్చే అనేక వంటల కార్యక్రమాల్లో కూడా పాల్గొన్న హయాన్.. వంటలు చేయడంలోనే కాదు, డ్యాన్స్ కూడా బాగా చేస్తాడు. ఇక తన కుకింగ్ హ్యాబీని కొనసాగిస్తూనే, పైలట్ కావాలని కోరుకుంటున్నాడు హయాన్.

ఇక గతంలో కేరళకు చెందిన శాన్వి అనే బాలిక గంటసేపట్లో 30 వంటకాలతో రికార్డ్ సృష్టించగా, ఆ రికార్డ్ బ్రేక్ చేస్తూ తమిళనాడుకు చెందిన ఎస్‌ఎన్ లక్ష్మి సాయిశ్రీ అనే బాలిక కేవలం 58 నిమిషాల్లోనే 46 రకాల వంటలు చేసి రికార్డ్ సాధించిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story