- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గ్రే డివోర్సీస్
సరిగ్గా... ఇరవై అయిదేళ్ల క్రితం
మెరుపులతో తళతళలాడిన ఆకాశం
రోడ్లను ముంచేసే వర్షం
చలిని పెంచిన వర్షం
చెలిమిని పంచిన వర్షం
దగ్గర చేసిన వర్షం
అదే చెట్టు కింద
స్వీట్ నథింగ్స్ చెప్పుకుంటూ
ఒకే గొడుగు కింద యుగాలు క్షణాల్లా
ఆగిపోయిన కాలంలో
ఎప్పుడు ఆగిపోయిందో
తెలియని వర్షం!
తరగని కబుర్లు,
చెదరని జ్ఞాపకాలు
రెండు దేహాల ఏకాత్మలు!
పెరుగుతున్న పిల్లలు
తరుగుతున్న భావావేశాలు
బాధ్యతల బంధంలో
మారు వేషపు నటనల
ఆద్యంతాల మధ్య జీవితం!
ఇరవై అయిదేళ్ల తర్వాత
అదే చెట్టు కింద
అదే రోడ్లను ముంచేసే వర్షం
ఉరుముల మెరుపుల
బీభత్స రసం!
ఉత్తర దక్షిణ ధ్రువాల్లా
వేరు వేరు గొడుగుల్లో
క్షణాలను యుగాలుగా చూస్తూ
వేరైన ఆత్మలతో
వ్యక్తిత్వ పోరాటంలో,
అస్తిత్వ ఆరాటంలో
ఈగోల యుద్ధంలో
ఎవరూ తగ్గని
వేరు వేరు దారుల్లో
ప్రయాణిస్తున్న
గ్రే డివోర్సీస్ వాళ్ళు!
డాక్టర్ చెంగల్వ రామలక్ష్మి.
- Tags
- Poem