- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అనాథ
పొద్దు పొద్దున తెల్లవారుతుండగా
చెవులకు ఇంపైన సంగీతం
అందించే ఆ పిట్టల సప్పుడు జాడేది
ఇంటి మీద కూసోని
చుట్టాల రాకను చెప్పే
కాకమ్మ అరుపులేవి
ఇంటి ముంగట వేప చెట్టుమీద
కుహు అంటూ రాగం తీసే
కోయిలమ్మ జాడేది
ఏది వాటి జాడేది
పాలిచ్చే ఆవేది
నాగలి నడిచే ఎద్దు ఏది
ఉట్టిమీద దాచిన పాల కోసం
నెక్కినక్కి తిరిగి పిల్లి ఏది
వారానికోసారి నాయినా తెచ్చిన
మాంసం బొక్క కోసం
ఎదురు చూసే కుక్కపిల్ల ఏది
ఇంటి ముంగట చెంగుచెంగున
ఎగురుతూ తిరిగే
ఆ అందాల లేగ దూడ ఏది
మోకాటి బురదలో కూడా
వెనకడుగు వేయకుండా
నాగలి నడిచే దున్నల జాడేది
ఆరోగ్య రక్షణ కోసం
లీటర్ల కొద్ది పాలిచ్చే
ఆనాటి బర్రెల జాడేది
సౌకర్యాల కోసం
సకల వసతుల కోసం
సాగిల పడుతున్న మనిషి
సహజ జీవనాన్ని మరిచి
ఉరుకుల పరుగుల జీవితంలో
ఉక్కిరి బిక్కిరి అవుతూ
ఊపిరాడని తరుణం
దాపురించడానికి కారణమేది
ప్రకృతి ప్రసాదించిన
జంతు జాలాన్ని
పక్షుల బలగాన్ని
తనకు తానే వెలివేసి
ఒంటరి పక్షై విలపిస్తున్న
ఓ అనాధ నేటి మనిషి
- చెన్న రాజు
99080 10610
- Tags
- Poem