ఇప్పుడే బతికాను

by Ravi |   ( Updated:2024-11-24 23:00:24.0  )
ఇప్పుడే బతికాను
X

ఆ క్షణం నేను చనిపోయా

ఆకలేసి బేకరీ కెళ్ళాను

రెండు స్యాండ్విచ్ ముక్కలను

ఆర్డర్ పై తెచ్చుకొని టేబుల్ పై పెట్టి

జాము కోసం వెళ్లి తెచ్చేలోపే

నా బ్రెడ్ ముక్కల్లో ఒకటి

ఒక బీదవాడు తినడం చూసి

కోపం వచ్చింది

అతడు తిని వెళ్లే లోపు

నా బ్రెడ్ ముక్కలు

వేరే టేబుల్ పై పెట్టానని

చూశాక తెలిసింది

నా బ్రెడ్ ముక్క తింటుండని

నాకు కోపం వచ్చినా

తన బ్రెడ్ ముక్క తింటున్నానని

ఏమనకుండా వెళ్లిపోయిన

ఆ మహర్షిని చూసి

నేనిప్పుడే మళ్లీ బతికాను.

గుండెల్లి ఇస్తారి

98499 83874

Advertisement

Next Story

Most Viewed